Friday, November 22, 2024

స్మార్ట్‌ ఆలోచనలు.. వాచ్‌ల విష‌యంలో మారిన యువ‌త‌ ఆస‌క్తి

సాంప్రదాయ చేతి గడియారాలు స్థానంలో స్మార్ట్ వాచ్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు అంతా వాటి హవానే నడుస్తోంది. మొబైల్‌కు అనుసంధానంగా పనిచేస్తూ స్టైలిష్‌గా ఉండే స్మార్ట్ వాచ్‌ల‌కు మార్కెట్లో మంచి డిమాండ్‌ ఉంది. ఫోన్‌కు వచ్చే నోటిఫికేషన్లు స్మార్ట్‌ వాచ్‌లో చూసుకునే వీలుంది. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో బ్లూటూత్‌, మైక్‌, స్పీకర్‌ వంటివి స్మార్ట్‌ వాచ్‌లో పొందుపరిచి అనేక టెక్‌ కంపెనీలు ప్రత్యేక స్మార్ట్‌ వాచ్‌లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి.

ఫిట్‌నెస్‌ వాకర్లుగా.. యువత క్రేజ్‌..

స్మార్ట్‌ వాచ్‌లకు అయితే ముఖ్యంగా యువతలో బాగా క్రేజ్‌ ఉంది. మొబైల్‌ నోటిఫికేషన్‌ అన్ని స్మార్ట్‌ వాచ్‌లో ఉండడంతో యువత, ఉద్యోగులు, సాఫ్ట్ వేర్‌ ఇంజనీర్లు, డాక్టర్లు, వివిధ వృత్తుల్లో ఉన్నవారు స్మార్ట్‌ వాచ్‌లను వినియోగిస్తున్నారు.
స్మార్ట్‌ వాచ్‌లు ఫిట్నెస్‌ బ్యాండ్లుగా, ట్రాకర్లుగా ఉపకరిస్తున్నాయి. ఆరోగ్య అంశాలను వీటి ద్వారానే తెలుసుకునే అవకాశం ఉంది. ఈ స్మార్ట్‌ వాచ్‌లు యాక్టివిటీ ట్రాకింగ్‌, స్లిప్‌ మానిటరింగ్‌, హార్ట్‌ రేట్‌ మానిటరింగ్‌, బ్లడ్‌ ఆక్సిజన్‌ మానిటరింగ్‌, ఒత్తిడి, క్యాలరీ మీటర్‌, పేడో మీటర్‌, మల్టిపుల్‌ సపోర్ట్‌, మోడల్‌ వంటి అంశాల గురించి కూడా తెలుపుతున్నాయి.

అలాగే వాకింగ్‌, రన్నింగ్‌, స్విమ్మింగ్‌, స్కిప్పింగ్‌ తదితర వ్యాయామాల ద్వారా శరీరంలో కలిగే మార్పులను శక్తి సామర్థ్యాలను తెలుపుతున్నాయి. అంతేకాకుండా అనారోగ్యాలకు సంబంధించిన హెచ్చరికలను కూడా తెలియజేస్తున్నాయి. రెగ్యులర్‌ యాక్టివిటీల గురించి, పని మధ్యలో విరామాన్ని కార్యాలయాల్లో అలసిపోయిన సందర్భాలలో రిమైండర్లు అలర్ట్‌ చేస్తాయి. సమయం ప్రకారం నిద్రపోవడం, తగినంత నీరు తాగడం వంటి అంశాలను తెలుసుకోవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement