Tuesday, October 22, 2024

HYD: యువ‌త‌కు తోడ్ప‌డుతున్న నైపుణ్యాభివృద్ది కార్యక్రమాలు… హిమాన్షు ప్రియదర్శి

హైద‌రాబాద్, ఆగ‌స్టు 5(ప్ర‌భ న్యూస్) : తెలంగాణలో తాము ప్రారంభించిన నైపుణ్యాభివృద్ది కార్యక్రమాలు ఇక్కడి యువతకి గణనీయంగా తోడ్పడుతున్నాయని హిందుస్థాన్ కోకాకోలా బెవరేజెస్ (హెచ్‌సిసిబి), చీఫ్ పబ్లిక్ అఫైర్స్, కమ్యూనికేషన్స్ అండ్ సస్టైనబిలిటీ ఆఫీసర్, హిమాన్షు ప్రియదర్శి అన్నారు. తమ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు వ్యూహాత్మకంగా మూడు ప్రాథమిక అంశాలకు అనుగుణంగా రూపొందించబడ్డాయంటూ అవి యువత, మహిళలు నైపుణ్యం పెంచడం, కార్పొరేట్ సంస్థలకు అనుగుణంగా వారిని సిద్ధం చేయడం, విద్యాపరమైన మౌలిక సదుపాయాలను మెరుగుపరచడమన్నారు.

తెలంగాణ ప్రభుత్వ భాగస్వామ్యంతో తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) ద్వారా తాము నిర్వహిస్తున్న క్యాంపస్ టు కార్పోరేట్ కార్యక్రమం గణనీయమైన ప్రభావాన్ని చూపిందన్న ఆయన ఈ భాగస్వామ్యంలో భాగంగా కంటెంట్‌ను అభివృద్ధి చేయడం, బోధకులను ఎంపిక చేయడం, శిక్షణ ఇవ్వడం, అధిక-నాణ్యత శిక్షణను అందించడానికి ట్రైన్ ది ట్రైనర్ (టిటిటి) ప్రోగ్రామ్‌లను అమలు చేయడం వంటివి హెచ్‌సిసిబి చేస్తుందన్నారు.

- Advertisement -

కార్యక్రమ విజయాన్ని నిర్ధారించడానికి తరగతి గది సెషన్‌లను నిర్వహించడం, విద్యార్థుల బ్యాచ్‌లను నిర్వహించడం, మొత్తం అమలును పర్యవేక్షించడం వంటి లాజిస్టికల్ అంశాలను టాస్క్ నిర్వహిస్తుందంటూ ఈ కార్యక్రమం ద్వారా 20,000 మందికి పైగా కళాశాల విద్యార్థులకు కీలకమైన కార్పొరేట్ నైపుణ్యాలను అందించామని, అదనంగా 5,000 మంది తమ ఇంప్లిమెంటేషన్ భాగస్వామిగా వై 4డీతో సేల్స్ అండ్ మార్కెటింగ్‌లో ప్రత్యేక శిక్షణ పొందారన్నారు. ఈ ఏడాది కూడా సేల్స్ అండ్ మార్కెటింగ్ ప్రోగ్రాం కింద దాదాపు 4,000 మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని ప్రణాళిక చేస్తున్నామన్నారు.

తాము పాఠశాల సౌకర్యాలను అప్‌గ్రేడ్ చేయడం, స్మార్ట్ బోర్డుల వంటి మెరుగైన విద్యా వనరులతో 1,000 మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చడంపై కూడా దృష్టి సారించామన్నారు. అంతేకాకుండా ఆర్థిక, డిజిటల్ అక్షరాస్యత నైపుణ్యాలతో 3,000 మంది మహిళలకు సాధికారత కల్పించామన్నారు. తెలంగాణలో తమ కార్యక్రమాలు ఈ ప్రాంతం సామాజిక-ఆర్థిక అభ్యున్నతికి గణనీయంగా దోహదపడ్డాయన్న ఆయన, క్యాంపస్ టు కార్పోరేట్ కార్యక్రమం, ప్రత్యేకించి, నైపుణ్యం కలిగిన మానవ వనరులను స్థానిక పరిశ్రమలకు మద్దతు ఇచ్చే జాబ్-రెడీ గ్రాడ్యుయేట్‌లగా సిద్ధం చేస్తుందని, తద్వారా ఆర్థిక వృద్ధిని పెంపొందించడంతో పాటుగా ఉపాధి అవకాశాలను సైతం మెరుగు పరుస్తుందన్నారు. తమ ప్రోగ్రామ్‌ల లబ్ధిదారుల నుండి సానుకూల స్పందన అందుకున్నామన్న ఆయన తమ ఉద్యోగ సంసిద్ధతను గణనీయంగా ఈ కార్యక్రమాలు పెంచుతున్నాయని చెబుతుండటం సంతోషంగా ఉందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement