Friday, November 22, 2024

సిగ్నిటీ మెగా డీల్‌, యూఎస్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌తో ఒప్పందం

సిగ్నిటీ టెక్నాలజీ తన డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ వ్యవస్థను విస్తరింపజేసుకోవడానికి, వేగవంతమైన సేవలు అందించాలనే లక్ష్యంతో.. అమెరికాలోని అతిపెద్ద ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థతో భారీ ఒప్పందం కుదుర్చుకుంది. 10 మిలియన్‌ డాలర్లకు పైగా విలువ చేసే ఏసీవీ డీల్‌పై సంతకం చేసింది. రానున్న మరికొన్నేళ్లలో ఈ డీల్‌ విలువ మరింత పెరిగే అవకాశం ఉంటుందని సిగ్నిటీ టెక్నాలజీ ప్రకటించింది. ఏఐ-ఆధారిత, ఐపీ నేతృతంలోని, వ్యూహాత్మక డిజిటల్‌ అస్యూరెన్స్‌, సాఫ్ట్‌వేర్‌ కాలిటీ ఇంజినీరింగ్‌, ఆటోమేషన్‌, టెస్టింగ్‌తో పాటు కన్సల్టింగ్‌ సర్వీసెస్‌లో సిగ్నిటీ సేవలు అందిస్తున్నది. ఈ రంగంలో గ్లోబల్‌ లీడర్‌గా నిలుస్తున్నది. ఈ ఒప్పందం సిగ్నిటీ అడైజరీ అండ్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ సరీసెస్‌ (ఏటీఎస్‌)ని ఉపయోగించి.. లెగసీ ట్రాన్స్‌ఫర్మేషన్‌కు మద్దతు ఇస్తుందని కంపెనీ సీఈఓ శ్రీకాంత్‌ చక్కిలమ్‌ తెలిపారు. క్లయింట్‌ ఫార్చ్యూన్‌ 500 కంపెనీ.. అమెరికాలో 20కు పైగా రాష్ట్రాల్లో, మూడు ఖండాల్లో సేవలు అందిస్తున్నది. ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌తో ఒప్పందం ఎంతో సంతోషకరమని, భారీ డీల్‌ను సాధించుకునే తమ సామర్థ్యానికి ఇది కూడా నిదర్శనమని చెప్పుకొచ్చారు.

ఇప్పటికే మొత్తం ఆదాయంలో 19.23 శాతం సహకరిస్తున్న తమ బీఎఫ్‌ఎస్‌ఐ రెవెన్యూను మరింత పెరుగుదలకు కారణం అవుతుందన్నారు. 300 మందికిపైగా నిపుణులతో తమ డొమైన్‌ ఎక్స్‌లెన్స్‌ సెంటర్‌లలోకి నిరంతర పెట్టుబడులు, ప్రత్యేకించి ఆర్థిక సేవల సీఓఈలో సామర్థ్యాలను మెరుగుపర్చడానికి సహకరిస్తుందని వివరించారు. డిజిటల్‌ రంగంలో ఊహించిన వృద్ధికి ఈ డీల్‌ ఎంతో సహకరిస్తుందని, డిజిటల్‌ ల్యాండ్‌ స్కేప్‌ గెలుపునకు సహాయం చేస్తామన్నారు. సిగ్నిటీ టెక్నాలజీస్‌ లిమిటెడ్‌ ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌ కేంద్రంగా కొనసాగుతున్నది. యూఎస్‌ఏ, యూకే, యూఏఈ, ఆస్ట్రేలియా, చెక్‌ రిపబ్లిక్‌, సింగపూర్‌లో కూడా సేవలు అందిస్తున్నది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement