Monday, November 18, 2024

HYD | టైటానియం ఎస్పీఆర్ కోసం కెపాసిట్ఈ తో సిగ్నేచర్ గ్లోబల్ రూ.1203 కోట్ల నిర్మాణ ఒప్పందం

హైద‌రాబాద్ : భారతదేశంలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ డెవలపర్‌లలో ఒకటైన సిగ్నేచర్ గ్లోబల్, సెక్టార్ 71, గురుగ్రామ్‌ వద్ద అభివృద్ధి చేయనున్న తమ ప్రీమియం రెసిడెన్షియల్ ప్రాజెక్ట్, టైటానియం ఎస్పీఆర్ కోసం నిర్మాణ కాంట్రాక్టును అందజేసినట్లు ప్రకటించింది. రూ. 1203 కోట్ల విలువైన ఈ కాంట్రాక్టును ప్రముఖ నిర్మాణ సంస్థ కెపాసిట్ ఈ ఇన్‌ఫ్రాప్రాజెక్ట్స్ లిమిటెడ్‌కు అప్పగించారు. 14.382 ఎకరాల విస్తీర్ణంలో ఉండే ఈ టైటానియం ఎస్పీఆర్ లో 3.5 బీహెచ్ కే, 4.5 బీహెచ్ కే తో కూడిన మొత్తం 608 యూనిట్లు ఉంటాయి. రెండు దశలలో అభివృద్ధి చేయనున్న 3.7 మిలియన్ చదరపు అడుగుల ప్రాజెక్ట్‌లో భాగంగా మొదటి దశ 2.1 మిలియన్ చ.అ.లను కలిగి ఉంది.

ఇది జూన్ 2024 నెలలో ప్రారంభించబడింది. ఈ ప్రాజెక్ట్ కు అద్భుతమైన స్పందనను లభించింది. ప్రీ-సేల్ సంఖ్య రూ. 2700 కోట్ల కంటే ఎక్కువ. ఈసందర్భంగా సిగ్నేచర్ గ్లోబల్ ఛైర్మన్ అండ్ హోల్-టైమ్ డైరెక్టర్ ప్రదీప్ అగర్వాల్ మాట్లాడుతూ… ప్రీమియం జీవన అనుభవాలను అందించాలనే తమ నిబద్ధతను టైటానియం ఎస్పీఆర్ ప్రదర్శిస్తుందన్నారు. తమ మొదటి ప్రీమియం ప్రాజెక్ట్‌లలో ఒకటి అయినప్పటికీ, ఇది కస్టమర్‌ల నుండి అద్భుతమైన స్పందనను పొందిందన్నారు. కెపాసిట్ ఈ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్‌తో భాగస్వామ్యం చేసుకోవడం ద్వారా, టైటానియం ఎస్పీఆర్ ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో ఒక మైలురాయిగా ఉద్భవించగలదని తాము విశ్వసిస్తున్నామన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement