హైదరాబాద్ నాణ్యమైన మరియు పర్యావరణ అనుకూల పద్ధతుల పట్ల నిబద్ధతతో గుర్తింపు పొందిన డి2సి డెయిరీ బ్రాండ్ అయిన సిద్స్ ఫార్మ్ , ఈ నెల 22న గచ్చిబౌలి ప్రాక్టీస్ స్టేడియంలో హైదరాబాద్ హెల్త్ రన్ మొదటి ఎడిషన్‌ను నిర్వహించనుంది. అన్ని ఫిట్‌నెస్ స్థాయిలలో రన్నింగ్ ప్రేమికులను ఆరోగ్యం మరియు సంక్షేమానికి అంకితమైన రోజులో పాల్గొనేలా ప్రోత్సహించడం ద్వారా కమ్యూనిటీ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం ఈ ఈవెంట్ లక్ష్యం.
హైదరాబాద్ హెల్త్ రన్ వివిధ రకాల ఫిట్‌నెస్ స్థాయిలలో పాల్గొనేలా 10కె టైమ్డ్ రన్, 5కె టైమ్డ్ రన్ లేదా 2కె నాన్-టైమ్డ్ రన్ మధ్య ఎంచుకునే అవకాశం అందిస్తుంది. దీనిలో పాల్గొనేవారు టి -షర్ట్, గూడీ బ్యాగ్, సర్టిఫికేట్, ఫినిషర్ మెడల్ మరియు ఆరోగ్యకరమైన అల్పాహారంతో సహా అనేక ఉత్తేజకరమైన బహుమతులను కూడా అందుకుంటారు.
“సిద్స్ ఫార్మ్ వద్ద , మా విస్తృతంగా పరీక్షించిన పాల ఉత్పత్తుల ద్వారా మాత్రమే కాకుండా ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడం ద్వారా మా కమ్యూనిటీని పెంపొందించడాన్ని మేము విశ్వసిస్తున్నాము. హైదరాబాద్ హెల్త్ రన్ అనేది అన్ని వర్గాల వ్యక్తులను ఒకచోట చేర్చి, వారి దినచర్యలో భాగంగా ఫిట్‌నెస్‌ను స్వీకరించేలా ప్రోత్సహించడానికి ఒక అవకాశం. ఈ కార్యక్రమ నిర్వహణ పట్ల మేము సంతోషంగా ఉన్నాము. హైదరాబాద్ కమ్యూనిటీ నుండి ఉత్సాహభరితమైన భాగస్వామ్యాన్ని ఎదురుచూస్తున్నాము” అని సిద్స్ ఫార్మ్ వ్యవస్థాపకుడు మరియు మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కిషోర్ ఇందుకూరి అన్నారు.
ఈ కార్యక్రమం లో డాక్టర్ విష్ణు వర్ధన్ రెడ్డి, IFS, TSIIC ; శ్రీమతి సీతా పల్లచోళ్ల, వియ్ హబ్ యొక్క సీఈఓ ; మరియు శ్రీ శ్రీనివాస్ రావు మహంకాళి (MSR), టి- హబ్ సీఈఓ తో సహా గౌరవనీయమైన అతిథులు హాజరుకానున్నారు. హైదరాబాద్ హెల్త్ రన్‌ను విజయవంతం చేసేందుకు సిద్స్ ఫామ్ అనేక ప్రసిద్ధ సంస్థలతో భాగస్వామ్యం కలిగి ఉంది. వీటిలో టీ-హబ్ , వియ్ హబ్, బియా బ్రాండ్ లైన బ్రూ & బ్లిస్, నట్-ఓ-లిసియస్ మరియు లా కాహ్ ఫే మరియు రెడ్ హెల్త్ వంటివి వున్నాయి.
సెప్టెంబర్ 22, 2024న ఉదయం 6:00 గంటలకు ప్రారంభమయ్యే రేసు, గచ్చిబౌలి ప్రాక్టీస్ స్టేడియం (గేట్ 1 ద్వారా ప్రవేశం) వద్ద జరుగనుంది.