Tuesday, November 26, 2024

2025-26 విద్యా సంవత్సరానికి దరఖాస్తులను ఆహ్వానించిన శివ్‌నాడార్ యూనివ‌ర్సిటీ..

శివ్ నాడర్ యూనివర్శిటీ, ఢిల్లీ-ఎన్.సి.ఆర్, ప్రముఖ బహుళ విభాగాలు, పరిశోధనా-కేంద్రీయ సంస్థ, 2025-26 విద్యా సంవత్సరం కోసం ప్రవేశాలను తెరిచింది. ఇంజనీరింగ్, నేచురల్ సైన్సెస్, మేనేజ్మెంట్, ఎంటర్ ప్రెన్యుర్ షిప్, హ్యుమానిటీస్, సోషల్ సైన్సెస్ నాలుగు స్కూల్స్ లో ప్రోగ్రాంస్ కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. యూనివర్శిటీ అధికారిక వెబ్ సైట్ (http://www.snu.edu.in/home) ద్వారా దరఖాస్తు చేయవచ్చు అని తెలిపింది.

2025-26 కోసం సంస్థ అందచేసే ఆఫరింగ్స్ లో కంప్యూటర్ సైన్స్ మరియు బిజినెస్ డేటా అనలిటిక్స్ లో ద్వంద్వ డిగ్రీ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాంస్ ఇవి కొత్త చేరిక. అరిజోనా రాష్ట్ర యూనివర్శిటీ, యుఎస్ఏ సహకారంతో ఇవి ప్రారంభించబడ్డాయి. ఈ ప్రోగ్రాంస్ విద్య మరియు పరిశ్రమ యొక్క అభివృద్ధి చెందుతున్న డిమాండ్లను పరిష్కరించడానికి రూపొందించబడ్డాయి. ఉపకారవేతనాల గురించి వివరాలు ఈ వెబ్ సైట్ లింక్ లో లభిస్తున్నాయి: https://snuadmissions.com/.

షివ్ నాడర్ యూనివర్శిటీ వైస్-ఛాన్స్ లర్, ప్రొఫెసర్ అనన్య ముఖర్జీ మాట్లాడుతూ… “కొత్త విద్యా సంవత్సరానికి ప్రవేశాలు ప్రారంభమవడంతో, తాము ఎంచుకున్న రంగాల్లో శ్రేష్టతను సాధించడానికి ఆతృతగా ఉన్న అభిరుచి గల వ్యక్తులను షివ్ నాడర్ యూనివర్శిటీ, ఢిల్లీ-ఎన్ సిఆర్ లో మేము సాదరంగా ఆహ్వానిస్తున్నాము. మా సంస్థ అకాడమిక్స్ ను మించి అందచేస్తోంది, సృజనాత్మకత, విశ్లేషణాత్మకమైన ఆలోచనలు, వ్యక్తిగత మరియు వృత్తిపరమైన వృద్ధికి సమతుల్యమైన విధానాన్ని పోషిస్తోంది,” అని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement