ఫినిష్డ్ లుబ్రికెంట్స్లో అంతర్జాతీయంగా అగ్రగామిగా వెలుగొందుతున్న షెల్.. తమ షెల్ అడ్వాన్స్ ఫ్యూయెల్ సేవ్ 10డబ్ల్యూ30ను వర్చువల్ కార్యక్రమంలో వినియోగదారులు, ట్రేడ్ భాగస్వాముల సమక్షంలో ఆవిష్కరించారు. పేరుకు తగినట్టే షెల్ అడ్వాన్స్ ఫ్యూయెల్ సేవ్ 10డబ్ల్యూ30ను ఇంధన సామర్థ్యం పెంపొందించడంతో పాటుగా నగదు ఆదా చేసే రీతిలో తీర్చిదిద్దారు. ఈ ఉత్పత్తి ద్వారా ప్రతీ రోజు ప్రయాణాలపై సంవత్సరానికి రూ.2,500 వరకు ఆదా చేసుకోవచ్చు. రోడ్ల మీద అధిక సమయం/దూరం తిరిగే వారు ఒక లీటర్కు పెట్టే ఖర్చుతో అదనంగా మరో 5 కి.మీటర్ల వరకు ప్రయాణించొచ్చు. తద్వారా తమ వ్యయాలను తగ్గించుకోవచ్చు. షెల్ లుంబ్రికెంట్స్ ఇండియా కంట్రీ హెడ్ దేబాంజలి సేన్ గుప్తా మాట్లాడుతూ.. ప్రపంచంలో అగ్రగామి లుంబ్రికెంట్స్ సరఫదారునిగా, మార్కెట్ డిమాండ్, లోతైన పరిజ్ఞానం, వినియోగదారులు మారుతున్న అవసరాలకు తగినట్టుగా అత్యున్నత నాణ్యత కలిగిన ఉత్పత్తులును అందించడానికి ప్రయత్నిస్తున్నామన్నారు.
విలువ పట్ల అత్యంత అప్రమత్తంగా వ్యవహరించే రోజువారీ బైక్ రైడర్లకు ఇది ఓ పరిష్కారంగా నిలుస్తుందన్నారు. పెరుగుతున్న ఇంధన ధరల వేళ అతి ముఖ్యమైన నిర్వహణ ఖర్చులను నియంత్రించుకోవడంలో ఇది తోడ్పడుతుందని తెలిపారు. కర్బన ఉద్గారాలను నియంత్రించడమే లక్ష్యంగా నూతన ఉత్పత్తులు ఉంటాయని స్పష్టం చేశారు. షెల్ అడ్వాన్స్ ఫ్యూయల్ సేవ్ అనేది అత్యున్నతమైన, పూర్తి సింథటిక్ ఉత్పత్తి అన్నారు. ప్యూర్ ప్లస్ సాంకేతికతతో దీన్ని తీర్చిదిద్దారని వివరించారు. బైక్ మైలేజీని పెంచుతుందని ప్రకటించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..