Friday, November 29, 2024

ట్రేడింగ్ అనుభవం సులభతరం.. డిస్కౌంట్ బ్రోకింగ్ కోసం ‘షీట్స్’ను ప్రవేశపెట్టిన షేర్.మార్కెట్

మార్కెట్ కార్యకలాపాలలో పాలుపంచుకునే వారికి శక్తినిచ్చి, వారి ట్రేడింగ్ అనుభవాన్ని మెరుగుపరిచేలా డిస్కౌంట్ బ్రోకింగ్ రంగంలోనే మొదటిసారిగా షీట్స్‌ను ఆవిష్కరిస్తున్నామని ఫోన్‌పే ప్రోడక్ట్ అయిన షేర్.మార్కెట్ నేడు ప్రకటించింది. వెబ్ ప్లాట్‌ఫామ్‌ అయిన trade.share.marketలో అందుబాటులో ఉన్న ఈ షీట్లు మార్కెట్ డేటాను నేరుగా ఒక స్ప్రెడ్ షీట్‌లోకి దిగుమతి చేసుకుని, తమ సొంత ట్రేడింగ్ నమూనాలు, వ్యూహాలను క్రియేట్ చేసుకురావడం ద్వారా ట్రేడర్లకు సహాయపడుతాయి.

షీట్స్‌ను ప్రవేశపెట్టడం ద్వారా ఈ రంగంలో కొత్త విప్లవాన్ని తీసుకురావడమే కాక, దేశంలోనే ఇలాంటి వినూత్నమైన ఫీచర్ అందించే ఏకైక డిస్కౌంట్ బ్రోకర్‌గా షేర్.మార్కెట్ అవతరించింది. ఈ అత్యాధునిక టూల్ మార్కెట్ కార్యకలాపాల్లో పాలుపంచుకుంటున్న వారు తమ తెలివి తేటలకు పదను పెట్టుకుని, మార్కెట్ కార్యకలాపాల్లో చేపట్టాల్సిన చర్యలను తెలుసుకోవడంలో సహాయపడుతుంది.

పరిమితమైన లేదా అసలు ప్రోగ్రామింగ్ బ్యాక్ గ్రౌండ్ లేని ట్రేడర్లు, ఇన్వెస్టర్లకు నిర్ధిష్ఠ విధానాలు, ప్రమాణాలు మ్యాచ్ అయ్యేలా చూసేందుకు వందలాది స్టాక్‌లను నిర్వహించడం, విశ్లేషించడం మాన్యువల్‌గా చేయడం అనేది ఎక్కువ సమయం తీసుకోవడమే కాక, సంక్లిష్టంగా తయారవుతోంది. షీట్స్ ఈ సవాల్ ను పరిష్కరించి, ఆప్షన్ యుక్తులను నిర్మించడం, కొనుగోలు, విక్రయ సంకేతాలు ఇచ్చేలా సిగ్నల్స్ రూపొందించడం, తక్షణ ప్రాతిపదికన ట్రెండ్స్‌ను సమర్థవంతంగా విశ్లేషించడం లాంటివి చేసేందుకు ట్రేడర్ సమాజానికి వీలు కల్పిస్తోంది.

షీట్ల ఆవిష్కరణ గురించి షేర్. మార్కెట్ CEO ఉజ్జ్వల్ జైన్ మాట్లాడుతూ.. “మార్కెట్ కార్యకలాపాల్లో పాలు పంచుకునే వారి బ్రోకింగ్ అనుభవాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్లడంతో పాటు అవగాహనతో కూడిన నిర్ణయాలు తీసుకునేందుకు తెలివైన మౌలికవసతులతో వారికి శక్తి నిచ్చేలా షేర్.మార్కెట్ నిరంతరం కృషి చేస్తుంది.

మానవ ప్రమేయం లేకుండానే అనేక స్టాక్‌లను ట్రాక్ చేసే ప్రక్రియను ఆటోమేట్ చేసే టూల్‌గా షీట్లు నిలుస్తాయి. ఇది ట్రేడర్లు తమ పెట్టుబడి వ్యూహాలను త్వరగా చేసి, తప్పిదాలు జరిగే రిస్క్‌ను తగ్గిస్తాయి. ఈ టూల్స్ మార్కెట్ సిగ్నల్స్, ట్రెండ్స్, మార్పు వేగాలను సునిశితంగా గుర్తించడానికి వీలు కల్పిస్తాయి.

- Advertisement -

ఈ శక్తివంతమైన కొత్త ఫీచర్లతో, షేర్. మార్కెట్ ట్రేడర్లు, పెట్టుబడి దారులు తమ వ్యూహాలను అమలు చేయడంలో సహాయపడుతాయి. ఇది తమకు నిజంగా అవసరమైన తెలివైన, అవగాహనతో కూడిన నిర్ణయాలపై దృష్టి సారించడానికి వారిని అనుమతిస్తాయి” అని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement