Monday, November 18, 2024

ఒడిదుడుకులతో ముగిసిన మార్కెట్లు..

దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ప్రారంభమై, ఆ తర్వాత స్వల్ప లాభాల్లోకొచ్చాయి. అమెరికా సహా అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల్లో ముగియగా, ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. కరోనా సెకండ్ వేవ్ విజృంభణ నేపధ్యంలో దేశంలో… ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ కలవరానికి కారణమవుతోంది. ప్రాఫిట్ బుకింగ్ కనిపించడంతో… ప్రారంభంలో నష్టపోయిన కీలక రంగాలు… గంటన్నర తర్వాత కాస్త లాభాల్లోకొచ్చాయి. దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో పాటు, అంతర్జాతీయంగా బలహీన సంకేతాలు ఉండటంతో ఇన్వెస్టర్లు జాగ్రత్త పడ్డారు. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 202 పాయింట్లు నష్టపోయి 47,878కి పడిపోయింది. నిఫ్టీ 64 పాయింట్లు కోల్పోయి 14,341 వద్ద స్థిరపడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement