దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లు బలహీనంగా ఉండటం ఇన్వెస్టర్ల సెంటిమెంటును దెబ్బతీసింది. రోజు ఆరంభ నుంచే మార్కెట్లు నష్టాలతో ట్రేడ్ అయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ సంకేతాలకు తోపాటు అమెరికా మార్కెట్ల లాభాల ముగింపు ఏషియా-పసిఫిక్ మార్కెట్ల నష్టాలు తదితర అంశాలు దేశీయ సూచీలపై ప్రభావం చూపాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 135 పాయింట్లు నష్టపోయి 52,443కి పడిపోయింది. నిఫ్టీ 37 పాయింట్లు కోల్పోయి 15,709 వద్ద స్థిరపడింది.
ఇది కూడా చదవండి: రామప్పపై నిర్లక్ష్యం వహిస్తే దేశమంతా నిందిస్తుంది: హైకోర్టు