ముంబయి – స్టాక్ మార్కెట్ సూచీలు నేడు భారీ లాభాలతో మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో బెంచ్‌మార్క్ ఇండియన్ ఈక్విటీ సూచీలైన బీఎస్‌ఈ సెన్సెక్స్, నిఫ్టీ భారీగా ఎగబాకాయి. ఈ క్రమంలో ఉదయం సెన్సెక్స్ 1,227 పాయింట్లు లేదా 1.55 శాతం పెరిగి 80,344.78 స్థాయిలో ఉండగా, నిఫ్టీ 50 370 పాయింట్లు లేదా 1.55 శాతం పెరిగి 24,277 స్థాయిలో ట్రేడైంది. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ 1028 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచీ కూడా 1013 పాయింట్లు పుంజుకుంది. దీంతో మదుపర్లు కొన్ని నిమిషాల్లోనే 8.6 లక్షల కోట్ల రూపాయలను దక్కించుకున్నారు.
టాప్ 5 స్టాక్స్
ఈ నేపథ్యంలో హెడిఎఫ్ సి బ్యాంక్, రిలయన్స్, ఎస్ బి ఐ, లార్సెన్, అదానీ ఎంటర్‌ప్రైస్ కంపెనీల స్టాక్స్ టాప్ 5 లాభాల్లో ఉండగా, జె ఎస్ డబ్ల్యు స్టీల్, ఇన్ఫోసిస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ సంస్థల స్టాక్స్ టాప్ 3 నష్టా్ల్లో ఉన్నాయి. ఈ క్రమంలో నిఫ్టీ 50లో 50 స్టాక్స్‌లలో 49 గ్రీన్‌లోనే ట్రేడవుతున్నాయి. ఇదే సమయంలో శ్రీరామ్ ఫైనాన్స్ (4.51 శాతం పెరుగుదల), మహీంద్రా అండ్ మహీంద్రా, అదానీ ఎంటర్‌ప్రైజెస్, లాభాలు ముందున్నాయి. పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ ఇండెక్స్ అత్యధికంగా లాభపడటంతో అన్ని రంగాల సూచీలు ఎక్కువగా ట్రేడవుతున్నాయి.
కారణమిదేనా..
దీంతో నిఫ్టీ స్మాల్‌క్యాప్ 1.83 శాతం, నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 సూచీ 1.79 శాతం పెరిగింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ నేతృత్వంలోని పార్టీల సంకీర్ణ విజయం, ప్రపంచ మార్కెట్లలో బలమైన సంకేతాలు సహా పలు అంశాల నేపథ్యంలో మార్కెట్లు పాజిటివ్ ధోరణుల్లో కొనసాగుతున్నాయి.