Saturday, November 23, 2024

కరోనా ఎఫెక్ట్: నష్టాలతో ముగిసిన మార్కెట్లు..

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని నష్టాలతో ప్రారంభించాయి. ఉదయం సానుకూలంగా ప్రారంభమైన సూచీలు ఇంట్రాడే గరిష్ఠాల నుంచి ఒక్కసారిగా దిగజారాయి. ఆ తర్వాత మార్కెట్లు మళ్లీ కోలుకోలేదు. ఆసియా దేశాల్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటం మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఇన్వెస్టర్లు ఆచితూచి అడుగులు వేశారు. ముఖ్యంగా హెవీ వెయిట్ కంపెనీలు రిలయన్స్, హెచ్డీఎఫ్సీ, ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి సంస్థల షేర్లు కుంగడం మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 189 పాయింట్లు పతనమై 52,735కి పడిపోయింది. నిఫ్టీ 45 పాయింట్లు కోల్పోయి 15,814 వద్ద స్థిరపడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement