పెరిగిన వస్తువుల ధరలను గమనిస్తే.. 125 గ్రాముల పియర్స్ సబ్బు ధర 2.4 శాతం నుంచి 3.7 శాతానికి పెరిగింది. అత్యంత ప్రాచుర్యం పొందిన లక్స్ సోప్.. రేటును 9 శాతం వరకు పెంచేసింది. వీటికితోడు సన్ సిల్క్ బాటిల్ ధర 8 శాతం నుంచి 10 మేర పెంచేసింది. 100 మిల్లి గ్రాముల క్లినిక్ ప్లస్ షాంపు ధరలను 15 శాతం పెంచింది. సామాన్యుల నుంచి అందరూ అత్యంత ఎక్కువగా వినియోగించే గ్లో అండ్ లవ్లీ రేట్లు 6 నుంచి 8 శాతం పెంచేసింది. పౌండ్స్ పౌడర్ ధర కూడా 5 నుంచి 7 శాతం వరకు పెరగడంతో.. ఈ వస్తువులు మరింత ప్రియం కానున్నాయి. చివరిసారిగా హిందుస్థాన్ యూనిలివర్ తన ఉత్పత్తుల ధరలను చివరిగా ఈ సంవత్సరం ఏప్రిల్లోనే పెంచింది. కంపెనీ చర్మ సౌందర్య సాధనాలు, డిటర్జెంట్లపై ఏకంగా 3 నుంచి 20 శాతం వరకు తమ ఉత్పత్తులను కంపెనీ పెంచింది. గత రెండేళ్ల కాలంలో వడ్డీ రేట్లను 4.40 శాతానికి ఆర్బీఐ పెంచడం ఇదే తొలిసారి.
Advertisement
తాజా వార్తలు
Advertisement