టాటా ఎంటర్ప్రైజెస్, బిగ్ బాస్కెట్ ఇప్పుడు తిరుపతిలో తమ కార్యకలాపాలను ప్రారంభించింది. భూమన అభియన్ రెడ్డి (డిప్యూటీ మేయర్, తిరుపతి) భారతదేశపు అతిపెద్ద ఆన్లైన్ సూపర్ మార్కెట్‌ను స్వాగతించడంతో పాటుగా తిరుపతిలో మొట్టమొదటి ఆర్డర్‌ను చేశారు. ప్రస్తుతం భారతదేశంలో అన్ని ప్రధాన నగరాల్లోనూ కార్యకలాపాలు నిర్వహిస్తున్న బిగ్ బాస్కెట్, తిరుపతిలో కార్యకలాపాలు ప్రారంభించడం ద్వారా భారతదేశంలో 200 మిలియన్ల ఇంటర్నెట్ వినియోగదారులకు అతి తక్కువ ధరలకు కిరాణా సరుకులు అందించే లక్ష్యానికి మరో అడుగు చేరువైంది. వినియోగదారులు ఇప్పుడు బియ్యం, పప్పులు, మసాలాలు, పర్సనల్ కేర్, బ్రాండెడ్ ఫుడ్, కిచెన్, గృహోపకరణాలు సహా విస్తృత శ్రేణి ఉత్పత్తులను కనీసం 6 శాతం తగ్గింపుతో యాప్ ద్వారా ఆర్డర్ చేయవచ్చు. ఈ ప్రారంభం విషయమై.. బిగ్ బాస్కెట్ బిజినెస్ హెడ్ హర్ష జెట్టి మాట్లాడారు.
నాణ్యమైన వస్తువుల అందజేత
టాటా వ్యాపార విభాగం బిగ్ బాస్కెట్ కుటుంబంలో భాగం కావాల్సిందిగా తిరుపతిలోని వినియోగదారులందరినీ స్వాగతిస్తున్నామన్నారు. భారతీయ వినియోగదారుల కిరణా అవసరాలను తాము పూర్తిగా అర్థం చేసుకున్నామని తెలిపారు. ప్రపంచం ప్రసిద్ధి చెందిన నగరంలో తమ సేవలను ప్రారంభించడం పట్ల సంతోషంగా ఉన్నామన్నారు. ప్రతీ రోజు అతి తక్కువ ధరలకు అత్యున్నత నాణ్యత కలిగిన ఉత్పత్తులను అందించాలన్నది తమ లక్ష్యం అన్నారు. తరలోనే తిరుపతి వాసులకు నమ్మకమైన గ్రోసరీ భాగసామిగా నిలువగలమని ఆశిస్తున్నామన్నారు. తాము అందించే ఉత్పత్తులు మంచి నాణ్యత కలిగి ఉంటాయన్నారు. వాటిని అత్యంత తక్కువ ధరకు అందుబాటులో ఉంచుతున్నామని వివరించారు. అన్ని విభాగాల్లో 20వేలకు పైగా ఉత్పత్తులను అందించడంతో పాటుగా.. కనీసం 6 శాతం రాయితీని ఎస్కేయులపై అందిస్తున్నామని తెలిపారు. సౌకర్యవంతమైన షాపింగ్ అనుభవాలను అందించడాన్ని బిగ్ బాస్కెట్ లక్ష్యంగా చేసుకుందని, ప్రతీ రోజూ తక్కువ ధరకు సరుకులు అందిస్తామని వివరించారు.
తిరుపతిలో బిగ్ బాస్కెట్, టాటా ఎంటర్‌ప్రైజెస్‌తో సేవలు.. సరుకులపై 6 శాతం డిస్కౌంట్
Advertisement
తాజా వార్తలు
Advertisement