Monday, November 18, 2024

నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు..

కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో…దాని ఎఫెక్ట్ స్టాక్ మార్కెట్ల పై పడుతోంది. వారాంతపు సెలవులు ముగించుకుని తాజా సెషన్స్ ఆరంభించిన భారత స్టాక్ మార్కెట్లు నష్టాలను ముటగట్టుకున్నాయి. సెన్సెక్స్ 551 పాయింట్ల నష్టంతో 50,284 వద్ద కొనసాగుతుండగా… నిఫ్టీ సైతం అదేబాటలో 160 పాయింట్లు నష్టపోయి 15,048 వద్ద కొనసాగుతోంది. ఇక అంతర్జాతీయంగానూ, దేశంలోనూ కరోనా మళ్లీ విజృంభిస్తుడటంతో మళ్లీ లాక్ డౌన్ వంటి ఆంక్షలు విధిస్తారన్న ప్రచారం జరుగుతోంది. దీంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు… గతవారం అమెరికా సూచీలు ప్రతికూల ఫలితాలు చవిచూడడం, ఇటు ఆసియా సూచీలు మధ్యస్థంగా కొనసాగుతుండడం భారత మార్కెట్ల ఓపెనింగ్ సెషన్ ను ప్రభావితం చేశాయి. కాగా, రియల్ ఎస్టేట్, క్యాపిటల్ గూడ్స్ రంగాల షేర్లు మాత్రం ఆశాజనకంగా ట్రేడవుతున్నాయి. మిగిలిన రంగాల షేర్లు నష్టాలబాటలో పయనిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement