ముంబై – గత రెండు రోజులుగా లాభాలలో నడిచిన దేశీయ స్టాక్ మార్కెట్ నేడు మాత్రం నష్టాలతో ముగిసింది.. ఈ ఉదయం మార్కెట్లు నష్టాలతోనే ప్రారంభమయ్యాయి. చివరి వరకు అదే ట్రెండ్ ను కొనసాగించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగించే సమయానికి సెన్సెక్స్ 187 పాయింట్లు నష్టపోయి 60,858కి పడిపోయింది. నిఫ్టీ 57 పాయింట్లు కోల్పోయి 18,107 వద్ద స్థిరపడింది. బడ్జెట్ రానున్న నేపథ్యంలో మదుపురులు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.. కాగా నేటి మార్కెట్ లో టాటా స్టీల్, పవర్ గ్రిడ్, టెక్ మహేంద్ర, యాక్సిస్ బ్యాంక్, హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ షేర్ లు లాభ పడ్డాయి.. ఎషియన్ పెయింట్స్, ఇండస్ బ్యాంక్, టాటా మోటర్స్ , కొటక్ బ్యాంక్ , టైటాన్ లు స్వల్పంగా నష్ట పోయాయి..
Advertisement
తాజా వార్తలు
Advertisement