Tuesday, November 26, 2024

మార్కెట్‌ లాభాలకు బ్రేక్‌, గరిష్టాల వద్ద లాభాల స్వీకరణ.. సెన్సెక్స్‌ 435 పాయింట్లు డౌన్‌

స్టాక్‌ మార్కెట్లు మంగళవారం భారీ నష్టాల్లో ముగిశాయి. రంగాలవారీగా చూసుకుంటే.. ఎఫ్‌ఎంసీజీ, పవర్‌ సూచీలు 1 శాతం నుంచి 3 శాతం వరకు లాభపడగా.. బ్యాంక్‌ సూచీలు 1 శాతం మేర నష్టపోయాయి. బీఎస్‌ఈ మిడ్‌ క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ సూచీలు ఒక్కో శాతం క్షీణించాయి. మార్కెట్లు గత రెండు సెషన్స్‌ లాభాల్లో ముగియగా.. వాటికి మంగళవారం బ్రేక్‌ పడింది. ఉదయం సెన్సెక్స్‌ 60,786.07 వద్ద ఊగిసలాటలో ప్రారంభమైంది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 60,786.07 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 60,107.06 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. చివరికి 435.24 పాయింట్ల నష్టంతో 60,176.56 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ చూసుకుంటే.. 18,095.45 పాయిట్ల వద్ద ప్రారంభమైంది. ఇంట్రాడేలో 17,921.55 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. చివరికి 96 పాయింట్లు నష్టపోయి 17,957.40 పాయింట్ల వద్ద ముగిసింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకపు విలువ మార్కెట్లు ముగిసే సమయానికి రూ.75.32 పాయింట్ల వద్ద ట్రేడ్‌ అవుతున్నది.

హెచ్డిఎఫ్‌సీ ట్విన్స్‌కు నష్టాలు..

సెన్సెక్స్‌ 30 షేర్స్‌లో ఎన్‌టీపీసీ, పవర్‌ గ్రిడ్‌, ఐటీసీ, నెస్లే ఇండియా, టైటాన్‌, టీసీఎస్‌, ఏషియన్‌ పెయింట్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, హెచ్‌యూఎల్‌, ఎంఅండ్‌ఎం షేర్లు లాభపడ్డాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంకు, బజాజ్‌ ఫైనాన్స్‌, రిలయన్స్‌, ఇన్ఫోసిస్‌, విప్రో షేర్లు నష్టపోయిన వాటిలో ఉన్నాయి. ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సంస్థలైన జొమాటో, స్విగ్గీలపై కాంపిటిషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా ఒక సవివరమైన దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసింది. రెస్టారెంట్‌ భాగస్వాములతో కుదుర్చుకునే ఒప్పందాలు అనైతికంగా ఉన్నాయంటూ నేషనల్‌ రెస్టారెంట్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా చేసిన ఓ ఫిర్యాదు నేపథ్యంలో.. ఈ ఆదేశాలు వెలువడ్డాయి. దీంతో జొమాటో షేర్లు ఈ రోజు దాదాపు 3 శాతం వరకు నష్టపోయాయి.

పెరిగిన చమురు ధరలు..

సోమవారం నాటి భారీ ర్యాలీ నేపథ్యంలో.. సూచీలు మంగళవారం స్థిరీకరణ దిశగా సాగాయి. కీలక కంపెనీల్లో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రతికూల సంకేతాలు సూచీల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. గతవారంతో పోలిస్తే.. చమురు ధరలు మంగళవారం భారీగా పెరిగాయి. ఇది ఆసియా మార్కెట్లపైన ప్రభావం చూపి.. సూచీలు నష్టపోయాయి. ఐరోపా మార్కెట్లు, అమెరికా ఫ్యూచర్‌ మార్కెట్లు కూడా ప్రతికూలంగా ఉన్నాయి.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement