Thursday, November 21, 2024

భారీ నష్టాలను మూటకట్టుకున్న మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాలతో ముగిసాయి. అంతర్జాతీయంగా ఎలాంటి సానుకూలతలు లేకపోవడం ఇన్వెస్టర్లపై ప్రభావాన్ని చూపింది. దీనికి తోడు చైనా టెక్ సెక్టార్ దెబ్బతినబోతోందనే ఆందోళనలు మార్కెట్లపై ప్రభావాన్ని చూపాయి. ఈ రోజు ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. ఆ తర్వాత సూచీలు మళ్లీ కోలుకోలేదు. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 485 పాయింట్లు పతనమై 52,568కి పడిపోయింది. నిఫ్టీ 151 పాయింట్లు కోల్పోయి 15,727కి దిగజారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement