దేశంలో ప్రస్తుతం ఉన్న సెకండ్ హ్యాండ్ కార్ల విక్రయాలు, గ్రోసరీ బిజినెస్‌ను నిలిపివేస్తున్నట్లు ఓలా ప్రకటించింది.
బిజినెస్ లక్ష్యాలు మారినందునే ఈ బిజినెస్‌లను నిలివేస్తున్నట్లు ఓలా తెలిపింది. ఓలా డ్యాష్, ఓలా రిటైల్ పేరుతో ఈ బిజినెస్‌లను నిర్వహిస్తున్నారు. ఓలా ఎలక్ట్రికల్ బిజినెస్‌ను మరింత బలోపేతం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఓలా ఎలక్ట్రికల్ వాహనాల బిజినెస్ పుంజుకుంటున్నందున దీనిపై మరింత ఎక్కువ పెట్టుబడులు పెట్టాలని ఓలా నిర్ణయించింది. ప్రధానంగా ఓలా ఎలక్ట్రిక్ కార్ల , బ్యాటరీ తయారీపై కేంద్రీకరినుంది. వీటితో పాటు పైనాన్షియల్ సర్వీసెస్‌పై కూడా వృద్ధి చేయనుంది. ఓలా ఎలక్ట్రికల్ ప్రస్తుతం 500 కోట్ల రూపాయాల ఆదాయాన్ని అధికమించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో వెయ్యి కోట్ల ఆదాయం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం ఓలా మార్కెట్‌లో రెండు ఓలా స్కూటర్స్ మోడల్స్‌ను ప్రవేశపెట్టింది. త్వరలోనే మరో స్కూటర్‌ను విడుదల చేయనుంది.
వాహన మార్కెట్‌లో మరింత బలోపేతం అయ్యేందుకు ఓలా గట్టి ప్రయత్నాలు చేస్తోంది. వాహన శ్రేణిని మరింత విస్త్రత పరచడం ద్వారా మార్కెట్‌లో పట్టుసాధించాలని నిర్ణయించింది. కంపెనీ మొబిలిటీ సేవలు 500 మిలియన్ ఇండియన్‌కు చేరడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. సెకండ్ హ్యాండ్ కార్ల అమ్మకాల బిజినెస్‌ను ఓలా 2021 అక్టోబర్‌లో ప్రారంభించింది. 30 పట్టణాల నుంచి ప్రస్తుతం వంద నగరాల్లో ఓలా కార్స్ కార్యకలాపాలు జరుగుతున్నాయి. వీటిని క్రమంగా తగ్గిస్తామని ఓలా సీఈవో అరుణ్ శ్రీదేశ్‌ముఖ్ తెలిపారు. 1441 ఓలా స్కూటర్స్ వెనక్కి ఇటీవల వరసగా ఓలా స్కూటర్స్‌లో అగ్ని ప్రమాదాలు జరుగుతున్నందున కంపెనీ 1441 స్కూటర్స్‌ను వెనక్కి పిలిపించింది. వీటిని కంపెనీ ఇంజనీర్లు క్షుణంగా పరిశీలిస్తున్నారని సీఈవో అరుణ్ శ్రీదేశ్‌ముఖ్ తెలిపారు. బ్యాటరీ సిస్టమ్‌లో ఏమైనా లోపాలు ఉంటే వాటిని సరి చేస్తామన్నారు.
2023లో ఓలా కారు..
ఓలా ఎలక్ట్రిక్ కారుపై ప్రస్తుతం ఆర్ అండ్ డి వర్క్ జరుగుతుందని ఓలా ఫౌండర్ భావిష్ అగ్రవాల్ వెల్లడించారు. ఓలా ఎలక్ట్రిక్ కారును 2023 లేదా 2024 ప్రారంభంలో మార్కెట్‌లోకి తీసుకు వస్తామని ప్రకటించారు. ఈ కార్లను విదేశాలకు కూడా ఎగుమతి చేస్తామన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.