దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నస్టాల్ని కొనసాగించాయి. వరుసగా రెండవ రోజు నష్టాల్లో ముగిశాయి. ఫెడ్‌వడ్డీరేట్ల పెంపు నేపథ్యంలో సూచీలు రోజంతా నష్టాల్లోనే చలించాయి. మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత కొనుగోళ్ల మద్దతుతో కనష్టాల నుంచి సూచీలు కొంతమేరకు పుంజుకున్నాయి. కానీ, ఎగువ స్థాయిల్లో అమ్మకాల ఒత్తిళ్ల కారణంగా చివరకు నష్టాల్లోనే స్థిరపడ్డాయి. అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లను 75 బేసిస్ పాయింట్లు పెంచింది. దాంతో అక్కడ వడ్డీరేట్లు 3.25 శాతానికి చేరుకున్నాయి. భవిష్యత్‌లో మరింత కఠినంగా వ్యవహరిస్తామని ఫెడ్ ప్రకటించింది. ఫలితంగా ఆర్థికమాంద్యం తప్పకపోవచ్చని ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ స్పష్టంచేశారు. ఈ ప్రకటన మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ఉదయం సెన్సెక్స్ 59,073 పాయింట్ల వద్ద నష్టాలతో ప్రారంభమైంది. ఇంట్రాడే సెషన్‌లో 600 పాయింట్లకు పైగా నష్టపోయింది.
ఒక దశలో 58,832 పాయింట్ల కనష్టానికి చేరింది. చివరకు 337పాయింట్ల నష్టంతో 59,119 వద్ద స్థిరపడింది. నిఫ్టీ కూడా 88 పాయింట్ల నష్టంతో 17,629 వద్ద ముగిసింది. రూపాయి పతనం కూడా మార్కెట్ల నష్టానికి కారణమైంది. సెన్సెక్స్-30 సూచీలోని 14 షేర్లు లాభపడ్డాయి. టైటాన్, హెచ్‌యుఎల్, ఏషియన్ పెయింట్స్, మారుతి, ఐటీసీ, డాక్టర్ రెడ్డీస్, భారతీ ఎయిర్‌టెల్, బజాజ్ ఫైనాన్స్, ఎన్‌టీపీసీ షేర్లు లాభాల్లో ముగిశాయి. పవర్‌గ్రిడ్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఐసీఐసీఐ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, రిలయన్స్, టెక్ మహింద్రా షేర్లు నష్టాల్లో ముగిశాయి. ఐటీ స్టాక్స్‌లో అమ్మకాలు కొనసాగుతున్నాయి. రూ. 1360 వద్ద ఇన్ఫీ 52 వారాల గరిష్టాన్ని తాకింది. చివరకు 0.67 శాతం నష్టంతో రూ. 1368 వద్ద స్థిరపడింది.