Wednesday, November 20, 2024

ఐపీఓ ధరలను నిర్ణయంచడం మాపనికాదు.. స్పష్టం చేసిన సెబీ ఛైర్‌పర్సన్‌ మాధవీ పురీ బుచ్‌

కొత్త తరం సాంకేతిక కంపెనీల పబ్లిక్‌ ఇష్యూ ధరలన్ని నిర్ణయించడం స్టాక్‌ మార్కెట్‌ నియంత్రణా సంస్థ సెబీ పని కాదని సంస్థ ఛైర్‌పర్సన్‌ మాధవీ పురీ బుచ్‌ చెప్పారు. ఫిక్కీ నిర్వహించిన క్యాపిటల్‌ మార్కెట్‌ వార్షిక సదస్సులో ఆమె ప్రసంగించారు.
ప్రీ మార్కెట్‌ ప్లేస్‌మెంట్‌ షేరు ధరతో పోల్చితే ఐపీఓ ధర ఎక్కువ ఉండడానికి గల కారణాలను మాత్రం టెక్‌ కంపెనీలు వెల్లడించాలని స్పష్టం చేశారు. ఓ కంపెనీ ప్రీ మార్కెట్‌ ప్లేస్‌మెంట్‌లో ఒక్కో షేరుని వంద రూపాయలకు మదుపర్లకు కేటాయిస్తే, కొన్ని నెలల వ్యవధిలోనే ఐపీఓలో అదే షేర ధరను 450 రూపాయలుగా నిర్ణయిస్తున్నారని తెలిపారు. ధర ఎంత ఉండాలని నిర్ణయించుకునే స్వేచ్ఛ కంపెనీలకు ఉందని, అయితే షేరు విలువలో ఒకేసారి ఇంత వ్యాత్యాసం రావడానికి ఏం దోహదం చేసిందో వెల్లడించాల్సిన అవసరం ఉందన్నారు.

ఇటీవల ఐపీఓకి వచ్చిన కొన్ని టెక్‌ కంపెనీలు ఇష్యూ ధరను ఎక్కువ నిర్ణయించారన్న వాదన పరిశ్రమ వర్గాల్లో ఉది. వాటాలో చాలా కంపెనీల షేర్లు తరువాత పతనాన్ని చవిచూశాయి. దీని వల్ల చిన్న మదుపర్లు పెద్ద ఎత్తున నష్టపోయారు. ఇలాంటి వాటి వల్ల కొత్తతరం సాంకేతిక కంపెనీల ఐపీఓ ధరలప సెబీ మార్గదర్శకాలు జారీ చేయాలనే డిమాండ్‌ వచ్చింది. ఇలాంటి కొన్ని కంపెనీలను ఉదహరిస్తూ వీటి విషయంలో ఏం చేయాలని సమావేశంలో కొంత మంది ఆమెను ప్రశ్నించారు. దీనికి ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్లే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని ఆమె స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement