ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థ బొంబే డౖౖెయింగ్ సెక్యూరిటీస్ మార్కెట్‌లో ప్రవేశించకుండా సెబీ రెండు సంవత్సరాల పాటు నిషేధం విధించింది. బొంబే డైయింగ్ కంపెనీ పాలిస్టర్,టెక్స్‌టైల్స్, రియల్ ఎస్టేట్‌తో పాటు పది రంగాల్లో బిజినెస్ నిర్వహిస్తోంది. కంపెనీ ఫైనాన్సియల్ స్టేట్‌మెంట్స్‌లో తప్పుడు సమాచారం ఇచ్చారన్న అభియోగంపై సెబీ ఈ చర్య తీసుకుంది.
బొంబే డైయింగ్ వాడియా గ్రూప్‌కు చెందినది. బొంబే డైయింగ్ ప్రమోటర్స్ నుస్లీవాడియా, ఆయన ఇద్దరు కుమారులులను కూడా సెక్యూరిటీ మార్కెట్‌లో కార్యకలాపాలు నిర్వహించకుండా రెండు సంవత్సరాలు నిషేధం విధిస్తున్నట్లు సెబీ ఒక ప్రకటనలో తెలిపింది. వాడియా గ్రూప్‌కు చెందిన మరో కంపెనీ స్కేల్ సర్వీసెస్‌పైనా నిషేధం విధించింది. ఈ కంపెనీకి చెందిన మాజీ డైరెక్టర్లు డీఎస్ గగ్‌రాత్, ఎన్‌హెచ్ దంతేవాలా, శైలేష్ కార్నిక్, ఆర్ చంద్రశేఖరన్, బొంబే డైయింగ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ దర్గేష్ మెహతాపై కూడా సెబీ నిషేధం విధించింది. మన దేశంలో అత్యంత పురాతనమైన కంపెనీల్లో బొంబే డైయింగ్ ఒకటి. వాడియా గ్రూప్ కింద అనేక బిజినెస్‌లు నిర్వహిస్తోంది. వాడియా గ్రూప్‌లో నాలుగు కంపెనీలు స్టాక్‌మార్కెట్‌లో లిస్ట్‌య్యాయి. నిషేధంతో పాటు వాడియా గ్రూప్‌పై సెబీ 157.5 మిలియన్ రూపాయల జరిమానా కూడా విధించింది. 2011-12, 2018-19 సంవత్సరాల్లో బొంబే డైయింగ్ కంపెనీ కార్యకలాలపై నిశితంగా పరిశీలించినట్లు సెబీ తెలిపింది.