సీవేస్ షిప్పింగ్ అండ్ లాజిస్టిక్ లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన సీవేస్ సప్లై చైన్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎస్‌ఎస్‌సీపీఎల్) ఖాతాలో అవార్డు వచ్చి చేసింది. ఎక్స్‌పోర్టు ఎక్సలెన్స్ అవార్డును మద్రాస్ ఎక్స్‌పోర్టు ప్రాసెసింగ్ జోన్ (ఎంఈపీజడ్) స్పెషల్ ఎకనామిక్ జోన్, చెన్నై అందజేసింది. 2019-20 ఏడాది కాలంలో అత్యధిక ఎంప్లాయ్మెంట్ అవకాశాలు కల్పించింది. చెన్నైలోని జై మాతా దీ సెజ్ లోకేషన్‌లోని ఎఫ్టీడబ్ల్యూజెడ్ కేటగిరిలో సీ వేస్ సప్లై చైన్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎస్‌ఎస్‌సీపీఎల్) తొలి స్థానంలో ఉంది. ఈ అవార్డును సీ వేస్ షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్ మార్కెటింగ్ డైరెక్టర్ పీ వివేక్ ఆనంద్ అందుకున్నారు. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర వాణిజ్య, పారిశ్రామిక మంత్రి అనుప్రియ పటేల్ చేతుల మీదుగా ఈ అవార్డును వివేక్ అందుకున్నారు. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ.. కంపెనీకి అమూల్యమైన ఆస్తి తమ ఉద్యోగులే అని చెప్పుకొచ్చారు. సీవేస్ గ్రూప్‌లో మెరుగైన సేవలు అందిస్తున్నామని, ఇన్నోవేటివ్ లాజిస్టిక్ సొల్యూషన్స్‌లో ఎంప్లాయ్ ఎంపవర్వెంట్ ఉందని, 32 ఏళ్లుగా ఈ రంగంలో సేవలు అంందిస్తున్నట్టు తెలిపారు. నమ్మకానికి మారుపేరుగా తమ సేవలు ఉంటాయని, తమ భాగస్వాములతో కలిసి అభివృద్ధి రంగంలో దూసుకెళ్తున్నట్టు వివరించారు.
సీవేస్ షిప్పింగ్ లిమిటెడ్ ఎక్స్ పోర్ట్ ఎక్సలెన్స్ అవార్డు.. అందజేసిన ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు
Advertisement
తాజా వార్తలు
Advertisement