Saturday, October 5, 2024

HYD: పండగ కాంపైన్ ను విడుదల చేసిన సీగ్రామ్ రాయల్ స్టాగ్ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్

హైదరాబాద్: భారతదేశంలో పండగ ఉల్లాసాన్ని ప్రారంభిస్తూ, రాయల్ స్టాగ్ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ కొత్త కాంపైన్ సెలబ్రేట్ లార్జ్ ను ప్రారంభించింది. తమ విలక్షణమైన స్టైల్ అండ్ డిజైన్ లను వివిధ పండగ సంబరాల్లో చేర్చాలని నేటి యువతరం ఏ విధంగ కోరుకుంటోంది కాంపైన్ చూపిస్తుంది.

ఈసందర్భంగా పెర్నాడ్ రికార్డ్ ఇండియా ఛీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అండ్ గ్లోబల్ బిజినెస్ డెవలప్ మెంట్ ప్రధాన అధికారి కార్తీక్ మొహీంద్రా మాట్లాడుతూ… తమ విలక్షణమైన స్టైల్ అండ్ శక్తిని వెల్లడించడానికి, ఎన్నో సంవత్సరాలు గుర్తుంచుకునే ఆనందాన్ని సృష్టించడానికి, ఖచ్చితంగా, లివ్ ఇట్ లార్జ్ కోసం యువత కోసం పండగలు సరైన సందర్భాలు అన్నారు. బ్రాండ్ నైతిక సూత్రాలకు అనుగుణంగా, బహుళ విధాల అనుభవాలను అందించే సెలబ్రేట్ లార్జ్ 360 డిగ్రీ కాంపైన్ ను తాము జాగ్రత్తగా రూపొందించామన్నారు.

- Advertisement -

ఎఫ్ సిబి ఇండియా ఛీఫ్ క్రియేటివ్ ఆఫీసర్ మయూరేష్ దుభాషి మాట్లాడుతూ… ప్రతి సంబరాన్ని పెద్దగా చేయాలని నేటి తరం సహజంగా కోరుకుంటుందన్నారు. ఆ భావన పండగ సీజన్ లో మరింత స్పష్టంగా కనిపిస్తుందన్నారు. తమ కాంపైన్ సెలబ్రేట్ లార్జ్ ద్వారా ఇంతకు ముందు లేని విధంగా తమ పండగలను ఆనందించడానికి ఈ ఏడాది తాము ఈ తరానికి విలక్షణమైన వేదికను కేటాయిస్తున్నామన్నారు. రీజనరేటివ్ ఏఐ, ఏఆర్, ఆహారం, బహుమతులు, సంగీతం, ఫ్యాషన్ సిఫారసుల ద్వారా, కొత్త ఆకర్షణీయమైన పండగ కాన్వాస్ తో తాము వారిని లివ్ ఇట్ లార్జ్ గా ప్రేరేపించాలని కోరుకుంటున్నామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement