అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్‌బీఐ జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో 6.7 శాతం లాభం తగ్గినట్లుగా ప్రకటించింది. బ్యాంక్ నికర లాభం స్టాండలోన్ పద్ధతిలో 6068 కోట్లుగా నమోదైంది. గత సంవత్సరం ఇదే కాలంలో నికర లాభం 6504 కోట్లుగా ఉంది. బ్యాంక్ మొత్తం ఆదాయంలోనూ స్వల్ప క్షిణత నమోదైంది. ఈ త్రైమాసికంలో మొత్తం ఆదాయం 74,998.47 కోట్లు గా ఉంది. గత సంవత్సరం ఇదే కాలంలో బ్యాంక్ ఆదాయం 77,347.17 కోట్లుగా ఉంది. స్థూల నిరర్ధక ఆస్తుల (ఎన్‌పీఏ) నిష్పత్తి 5.32 శాతం నుంచి 3.91 శాతానికి తగ్గింది. నికర వడ్డీ ఆదాయం 13 శాతం పెరిగి 31,196 కోట్లకు చేరింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement