దేశంలో అతి పెద్ద ప్రభుత్వ రంగంలోని భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్‌బీఐ) సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసిక ఆర్ధిక ఫలితాలు ప్రకటించింది. బ్యాంక్ నికర లాభం 9.13 శాతం పెరిగి 16,099.58 కోట్లుగా నమోదైంది. గత సంవత్సరం ఇదే కాలంలో బ్యాంక్ నికర లాభం 14,752 కోట్లుగా ఉంది. ఈ ఆర్ధిక సంవత్సరం జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికంలో బ్యాంక్ నికర లాభం 18,356 కోట్లుగా నమోదైంది. జూన్ త్రైమాసికంతో పోల్చితే, సెప్టెంబర్ త్రైమాసికంలో నికర లాభం స్వల్పంగా తగ్గింది. స్టాండలోన్ పద్ధతిలో నికర లాభం 13,264 కోట్ల నుంచి 14,330.02 కోట్లకు పెరిగింది.
దేశంలో ఐదో వంతు మార్కెట్ వాటానుఉ కిలిగి ఉన్న ఎస్‌బీఐ మొత్తం ఆదాయం సమీక్షా త్రైమాసికంలో 88,733 కోట్ల నుంచి 1.12 లక్షల కోట్లకు పెరిగింది. స్థూల నిరర్ధక ఆస్తుల నిష్పత్తి (ఎన్‌పీఏ) 3.52 నుంచి 2.55 శాతానికి తగ్గింది. తొలి త్రైమాసికంలో ఎన్‌పీఏలు 2.76 శాతంగా ఉన్నాయి. క్యాపిటల్ అడిక్వసీ 14.28 శాతంగా ఉంది.