Friday, November 22, 2024

ఎస్‌బీఐ నికర లాభం 74 శాతం వృద్ధి.. వ‌డ్డీల‌పై ఆదాయంతోనే..

బ్యాంకింగ్‌ దిగ్జజం స్టేబ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా త్రైమాసిక ఆర్ధిక ఫలితాల్లో అదరగొట్టింది. సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో రికార్డ్‌ స్థాయిలో లాభాలను ఆర్జించింది. గత సంవత్సరం ఇదే కాలంలో 7,626.57 కోట్ల రూపాయల నికర లాభం ఆర్జించిన ఎస్‌బీఐ, ఈ సంవత్సరం 73.93 శాతం వృద్ధితో ఏకంగా 13,264.62 కోట్ల లాభాన్ని ఆర్జించింది. మొండి బకాయిలు తగ్గడం, వడ్డీ ద్వారా వచ్చే ఆదాయం పెరగడం వల్ల భారీ లాభాలు నమోదు చేసిందని ఎస్‌బీఐ తెలిపింది. ఈ త్రైమాసికంలో బ్యాంక్‌ ఆదాయం 14 శాతం పెరిగి 88,733.86 కోట్లకు పెరిగింది.

గత సంవత్సరం ఇదే కాలంలో బ్యాంక్‌ ఆదాయం 77,589.09 కోట్లుగా ఉంది. సమీక్షా త్రైమాసికంలో వడ్డీ ఆదాయం కూడా 12.83 శాతం వృద్ధితో 35,183 కోట్లకు పెరిగినట్లు ఎస్‌బీఐ తెలిపింది. సెప్టెంబర్‌ 30 నాటికి ఎస్‌బీఐ డిపాజిట్లు 41,90,255 కోట్లకు చేరాయి. గత సంవత్సరంతో పోల్చితే 10 శాతం మేర డిపాజిట్లు పెరిగాయి. గత సంవత్సరం ఇదే కాలంలో బ్యాంక్‌ డిపాజిట్లు 38,09,630 కోట్లుగా ఉన్నాయి. బ్యాంక్‌ నిరర్ధక ఆస్తులు 1.52 శాతం నుంచి 0.80 శాతానికి తగ్గినట్లు ఎస్‌బీఐ తెలిపింది. వీటి విలువ పరంగా 2699 కోట్ల నుంచి 2011 కోట్లకు తగ్గాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement