అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూకట్‌పల్లిలోని వై జంక్షన్ వద్ద తన కొత్త బ్రాంచ్‌ను ప్రారంభించింది. ఈ బ్రాంచ్‌ను బ్యాంకు డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ సలోని నారాయణ్ ప్రారంభించారు. ఈ మేరకు ఎడ్యుకేషన్ లోన్, కార్ లోన్‌తో పాటు పర్సనల్ యాక్సిడెంటల్ క్లెయిమ్స్‌కు సంబంధించిన పత్రాలను సదరు కస్టమర్లకు సలోని నారాయణ్ అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎస్‌బీఐ తన సేవలను మరింత విస్తరింజేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నదని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా అన్ని రకాల సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని వివరించారు. సాంకేతిక వ్యవస్థను ఉపయోగించుకుని.. తమ కస్టమర్లకు సులభతరమైన సేవలు అందిస్తున్నామని చెప్పుకొచ్చారు. ఫ్రెండ్లీ, ఎంతో సురక్షితమైన సేవలు అందించడంలో ఎస్‌బీఐ ముందు వరుసలో ఉందని తెలిపారు. పర్సనల్ సెగ్మెంట్‌తో పాటు ప్రగతినగర్‌కు చెందిన ఎస్‌ఎంఈ కస్టమర్స్‌కు అన్ని రకాలు సేవలు వై జంక్షన్‌లోని ఈ బ్రాంచ్‌లో అందుతాయని వివరించారు.
కస్టమర్లకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు బ్యాంకు ఉద్యోగులు మరింత కృషి చేస్తారని భరోసా ఇచ్చారు. తమ సిబ్బంది అన్ని బ్యాంకుల్లో మంచి సేవలు అందిస్తున్నారని కొనియాడారు. స్కీం/ఇన్వెస్ట్‌మెంట్స్‌కు సంబంధించిన అన్ని విషయాలు, కీలక స్కీంలను ప్రజలకు వివరించడంలో సిబ్బంది చూపుతున్నచొరవ ఎంతో అభినందనీయమన్నారు. అన్ని రకాలుగా కస్టమర్లు లబ్ది పొందాలన్నదే తమ ధ్యేయమని చెప్పుకొచ్చార. ఈ కార్యక్రమంలో ఎన్‌డబ్ల్యూ-1 జనరల్ మేనేజర్ జోగేష్ చంద్ర సాహు, ఎన్‌డబ్ల్యూ-2 జనరల్ మేనేజర్ కిషన్ శర్మ, సైబరాబాద్ ఏఓ డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీరాం సింగ్, ఆర్‌బీఓ కూకట్‌పల్లి రీజినల్ మేనేజర్ నీరజతో పాటు బ్రాంచ్ మేనేజర్ శ్రీకాంత్, సిబ్బంది పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..