Thursday, November 21, 2024

కరోనాను సొమ్ము చేసుకుంటున్నారు.. కరోనా సోకిన వారికి బ్యాంకు రుణాలు

దేశంలో కరోనా వ్యాధిని ప్రభుత్వ రంగ బ్యాంకు సొమ్ము చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో కరోనా పేషెంట్ల కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) కవచ్ పర్సనల్ లోన్ స్కీంను ప్రవేశపెట్టింది. ఈ స్కీం కింద రూ.5 లక్షల వరకు రుణాన్ని అందిస్తోంది. వడ్డీ రేటు కూడా కేవలం 8.5 శాతానికి మంజూరు చేస్తోంది. ఎలాంటి తనఖా కూడా అవసరం లేదు. వ్యక్తిగత రుణ విభాగంలో ఇప్పటి వరకు ఇదే కనిష్ట వడ్డీ రేటు అని బ్యాంకు చెబుతోంది.

60 నెలల కాలపరిమితితో కూడిన ఈ రుణంపై మూడు నెలల వరకు మారటోరియం ఆఫర్ చేస్తోంది. వ్యక్తిగత లేదా కుటుంబ సభ్యులు కరోనా చికిత్స అవసరాల కోసం ఈ రుణాన్ని పొందవచ్చును. ఈ రుణ పథకంలో ఇప్పటికే వెచ్చించిన కరోనా వైద్య ఖర్చులకు రీయింబర్స్‌మెంట్ సౌకర్యం కూడా ఎస్‌బీఐ కల్పిస్తోంది. కరోనా బారిన పడుతున్న వారికి ఆర్థిక సాయం అందించే ఉద్దేశ్యంలో భాగంగా ఈ రుణ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు ఎస్‌బీఐ ఛైర్మన్ దినేష్ కారా తెలిపారు. వేతనజీవులు కాని వారికి కూడా ఈ రుణాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement