స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) మరోసారి రిటైల్ టర్మ్ వడ్డీరేట్లను పెంచింది. 50 నుంచి 80 బేసిస్ పాయింట్ల వరకు వివిధ రకాల వడ్డీరేట్లను ఎస్‌బీఐ పెంచింది. 7 రోజుల నుంచి 45 రోజుల ఎఫ్‌డీలపై 3 శాతం కనిష్ట వడ్డీ లభిస్తుంది. 46 రోజుల నుంచి 1 సంవత్సరం కంటే తక్కువ కాల వ్యవధి ఎఫ్‌డీలపై 4.50 నుంచి 5.50 శాతం వరకు వడ్డీ పెంచింది. 1 నుంచి 2 సంవత్సరాల కాల్యవధి ఉన్న ఎఫ్‌డీలపై 6.10 శాతం వడ్డీ ఇవ్వనుంది. 2 నుంచి 5 సంవత్సరాల కాల వ్యవధి ఎఫ్‌డీలపై 6.25 శాతం వరకు వడ్డీ లభిస్తుంది.
సీనియర్ సిటీజన్లు 7 రోజుల నుంచి 45 రోజుల వ్యవధికి 3.50 శాతం కనిష్ట వడ్డీరేటును పొందుతారు. 5నుంచి 10 సంవత్సరాల ఎఫ్‌డీలప 6.90 వరకు గిరిష్ట వడ్డీ రేటు పొందుతారు. పెరిగిన డిపాజిట్ వడ్డీ రేట్లు అక్టోబర్ 22 నుంచి అమల్లోకి వస్తాయని ఎస్ బీఐ తెలిపింది. ఈ వర్డీ రేట్లు 2 కోట్ల రూపాయల డిపాజిట్లకు వర్తిస్తాయి.