Sunday, November 24, 2024

HYD: ఎస్బిఐజి హెల్త్ సూపర్ టాప్-అప్ పాలసీని విడుదల చేసిన ఎస్బిఐ జనరల్ ఇన్సూరెన్స్

హైద‌రాబాద్ : భారతదేశంలోని ప్రముఖ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీల్లో ఒకటైన ఎస్బిఐ జనరల్ ఇన్సూరెన్స్ తమ నూతన ఎస్బిఐజి హెల్త్ సూపర్ టాప్-అప్ ను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఇది ఒక ఆర్థిక, సరసమైన ఎంపికగా రూపొందించబడిన ఆరోగ్య బీమా టాప్-అప్ ప్లాన్. తమ ప్రాధమిక ఆరోగ్య బీమా పాలసీతో పాటుగా దీనిని పాలసీదారులు ఎంచుకోవచ్చు. తమ ప్రస్తుత పాలసీని మెరుగు పరుచుకోవాలని కోరుకునే వ్యక్తులకు, వారి నిర్దిష్ట అవసరాలకు అనుగుణంగా వారి కవరేజీని పొందేందుకు ఇది అనుమతిస్తుంది.


ఈ పాలసీ గురించి ఎస్బిఐ జనరల్ ఇన్సూరెన్స్ చీఫ్ ప్రొడక్ట్ అండ్ మార్కెటింగ్ ఆఫీసర్ సుబ్రహ్మణ్యం బ్రహ్మజోస్యుల మాట్లాడుతూ… వైద్య చికిత్సల ఖర్చులు, జీవనశైలి సంబంధిత వ్యాధుల పెరుగుతున్న నేపథ్యంలో సమగ్ర ఆరోగ్య కవరేజీని కలిగి ఉండటం అవసరమన్నారు. ఎస్బిఐ జనరల్‌లో, కస్టమర్‌ల అభివృద్ధి చెందుతున్న అవసరాలను తీర్చే సరళీకృత, సరసమైన రిస్క్ సొల్యూషన్‌లను అందించడంలో తాము ఎల్లప్పుడూ ముందుంటామన్నారు. ఎస్బిఐజి హెల్త్ సూపర్ టాప్-అప్ ఇన్సూరెన్స్ పాలసీ వ్యక్తులు, కుటుంబాల విభిన్న అవసరాలకు అనుగుణంగా రూపొందించబడింది, ఊహించని వైద్య అత్యవసర పరిస్థితుల్లో మనశ్శాంతి, ఆర్థిక భద్రతను అందిస్తుందన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement