Friday, November 22, 2024

ఎస్‌బీఐ క్యాష్‌బ్యాక్‌ క్రెడిడ్‌కార్డు

ప్రభుత్వరంగ దిగ్గజ బ్యాంక్‌ ఎస్‌బీఐ సరికొత్త క్రెడిట్‌కార్డును విడుదల చేసింది. క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లు కోరుకునే వినియోగదారుల కోసం ఈ కార్డును తీసుకొచ్చినట్లు తెలిపింది. క్యాష్‌ బ్యాక్‌ క్రెడిట్‌కార్డు పేరిట మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఈ కార్డుద్వారా జరిపే ఆన్‌లైన్‌ లావాదేవీలపై 5శాతం క్యాష్‌బ్యాక్‌ లభిస్త్తుంది. ఆఫ్‌లైన్‌ చెల్లింపులపై ఒక శాతం క్యాష్‌బ్యాక్‌ పొందవచ్చు. స్పెషల్‌ ఆఫర్‌ కింద ఈ కాంటాక్ట్‌లెస్‌ క్రెడిట్‌ కార్డును మొదటి సంవత్సరం ఉచితంగా అందిస్తున్నట్లు ఎస్‌బీఐ కార్డ్‌ వెల్లడించింది. కొత్త కార్డు ద్వారా క్రెడిట్‌కార్డు పోర్టుపోలియో బలోపేతం అవుతుందని ఎండీ రామ్మోహన్‌రావు విశ్వాసం వ్యక్తంచేశారు.

ఎస్‌బీఐ కార్డు స్ప్రింట్‌ వెబ్‌సైట్‌లో డిజిటల్‌ అప్లికేషన్‌ను పూర్తిచేసి సులువుగా కార్డు పొందవచ్చని తెలిపారు. త్రైమాసికానికి ఒకటి చొప్పున దేశీయ విమానాశ్రయాల్లో 4 లాంజ్‌ సేవలు ఉచితంగా లభిస్తాయి. అద్దె చెల్లింపులు, చమురు కొనుగోళ్లు, వాలెట్లలోకి నగదు లోడ్‌ చేయడం, మర్చంట్‌ ఈఎంఐలు, క్యాష్‌బ్యాక్‌ అడ్వాన్సులు వంటివాటిపై క్యాష్‌బ్యాక్‌ వర్తించదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement