Friday, November 22, 2024

ఆసియలో సంపన్న మహిళగా సావిత్రి జిందాల్‌.. దేశ సంపన్నుల్లో 10వ స్థానం

ఆసియాలోనే అత్యంత సంపన్న మహిళగా మన దేశానికి చెందిన సావిత్రి జిందాల్‌ అగ్రస్థానంలో ఉన్నారు. జిందాల్‌ గ్రూప్‌ ఛైర్‌పర్సన్‌ అయిన ఆమె నికర సంపద 11.3 బిలియన్‌ డాలర్లు. ఈ విషయాన్ని బ్లూమ్‌బెర్గ్‌ బిలియనిర్స్‌ సూచీ వెల్లడించింది.
చైనాకు చెందిన రియల్‌ ఎస్టేట్‌ సంస్థ కంట్రీ గార్డెన్‌ కో చైర్మన్‌గా ఉన్న యాంగ్‌ హుయాన్‌ ఇప్పటి వరకు ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. చైనాలో రియల్‌ ఎస్టేట్‌ రంగంలో సంక్షోభంలో పడిపోవడంతో ఆమె 52 శాతం సంపద నష్టపోయారు. గత సంవత్సరం ఆమె సంపద 23.7 బిలియన్‌ డాలర్లు ఉంటే, ప్రస్తుతం 11 బిలియన్‌ డాలర్లకు పడిపోయింది. దీని వల్ల ఆమె ఆసియా సంపన్న మహిళ ర్యాంక్‌ను కోల్పోయి, మూడో స్థానానికి పడిపోయారు. ప్రస్తుతం సావిత్రి జిందాల్‌ 11.3 బిలియన్‌ డాలర్ల సంపదతో ఈ జాబితాలో అగ్రస్థానానికి చేరుకున్నారు. చైనాకు చెందిన మరో బిజినెస్‌ టైకూన్‌ ఫాన్‌ హాంగ్‌వియ్‌ రెండో స్థానంలో ఉన్నారు.

మన దేశంలో సంపన్న మహిళల్లో సావిత్రి జిందాల్‌ అగ్రస్థానంలో ఉన్నారు. మొత్తం దేశంలోని సంపన్నుల జాబితాలో 10వ స్థానంలో ఉన్నారు. ప్రస్తుతం ఆమె వయస్సు 72 సంవత్సరాలు. జిందాల్‌ గ్రూప్‌ వ్యవస్థాపకుడు, ఆమె భర్త ఓపీ జిందాల్‌ 2005లో జరిగిన విమాన ప్రమాదంలో చనిపోయారు. అప్పటి నుంచి ఆమె సంస్థ బాధ్యతలు చూస్తున్నారు. దేశంలో మూడో అతి పెద్ద ఉక్కు ఉత్పత్తిదారుగా జిందాల్‌ గ్రూప్‌ ఉంది. స్టీల్‌తో పాటు సిమెంట్‌, ఎనర్జీ, మౌలిక సదుపాయాల రంగాల్లోనూ ఈ కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement