Monday, July 8, 2024

Soudi: భారతీయుల కోసం బహుళ వీసా అవకాశాలను ప్రకటించిన సౌదీ

హైదరాబాద్ : తమ దేశంలో వైవిధ్యమైన గమ్యస్థానాలకు సులభంగా చేరుకోవడం సాధ్యం చేస్తూ అనేక రకాల పర్యాటక వీసా అవకాశాలను భారతీయ యాత్రికులను సౌదీ అందిస్తుంది. స్టాప్‌ఓవర్ వీసా, ఈ-వీసా సేవలు, వీసా-ఆన్-అరైవల్ తో, రియాద్ నగర అందాలు, జెడ్డా సాంస్కృతిక గొప్పతనం, ఎర్ర సముద్రం రహస్య సంపద, అల్ ఉలా పురాతన అద్భుతాలను అన్వేషించడానికి సౌదీ ఆహ్వానాన్ని అందిస్తోంది.

కొత్త మార్గదర్శకాలు, వీసా ఎంపికలు అనేక రకాల ప్రయాణ అవసరాలను తీరుస్తాయి, దేశాన్ని అన్వేషించడానికి ఎక్కువ మంది ప్రయాణికులను ప్రోత్సహిస్తాయి. ప్రస్తుతం ముంబై, ఢిల్లీ, కొచ్చిన్, చెన్నై, హైదరాబాద్, అహ్మదాబాద్, బెంగుళూరు, లక్నో, కోల్‌కతా, కాలికట్‌లలో 10 వీసా ఫెసిలిటేషన్ కేంద్రాలు ఉన్నాయి. అదనపు నగరాల్లో మరిన్ని ప్రత్యేక కేంద్రాలను జోడించే యోచనలో సౌదీ వుంది.

- Advertisement -

ఇది సౌదీ విజన్ 2030కి అనుగుణంగా ఉంది, 2030 నాటికి 7.5 మిలియన్ల మంది భారతీయ ప్రయాణీకులను స్వాగతించే లక్ష్యంతో నంబర్ 1 సోర్స్ మార్కెట్‌గా భారతదేశ సామర్థ్యాన్ని ఉపయోగించుకునే లక్ష్యంతో ఇది కృషి చేస్తుంది. 2024 చివరి నాటికి, సౌదీ సందర్శకుల సంఖ్యను 2.2మిలియన్ కు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. స్టాప్‌ఓవర్ వీసా, ఈ- వీసా, వీసా ఆన్ అరైవల్, వంటి వాటి కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement