హైదరాబాద్ : భారతదేశంలో అతిపెద్ద వినియోగదారు ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ అయిన శాంసంగ్ భారతదేశంలో గెలాక్సీ ఏ16 5జిని విడుదల చేసినట్లు వెల్లడించింది, దీని ప్రారంభ ధర రూ.18999. సరసమైన ధరలో వినియోగదారులకు అద్భుతమైన ఆవిష్కరణలను అందజేస్తూ 6 తరాల ఓఎస్ అప్‌గ్రేడ్‌లు, 6 సంవత్సరాల భద్రతా నవీకరణలను అందించడం ద్వారా మధ్య-శ్రేణి స్మార్ట్‌ఫోన్‌ల కోసం భారతదేశంలో కొత్త ప్రమాణాన్ని గెలాక్సీ ఏ16 5జి నిర్దేశించనుంది. శాంసంగ్ గెలాక్సీ ఏ16 5జి రెండు వేరియంట్లలో లభిస్తుంది. 8 జిబి / 128 జిబి, 8 జిబి / 256 జిబి. ఇవి గోల్డ్, లైట్ గ్రీన్, బ్లూ బ్లాక్ వంటి అధునాతన రంగుల్లో ఈ రోజు నుండి రిటైల్ స్టోర్‌లు, శాంసంగ్.కమ్, అమెజాన్.ఇన్ ప్లిప్ కార్ట్.కమ్ తో సహా ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉంటుంది.
ఇందులో అద్భుతమైన డిజైన్, పనితీరు. సొగసైన, ఆచరణాత్మకమైన స్మార్ట్ ఫోన్ గా శాంసంగ్ గెలాక్సీ ఏ16 5జి రూపొందించబడింది. ఈ పరికరం కేవలం 7.9 మిమీ వెడల్పు తో ఉంటుంది. అలాగే అద్భుతమైన కెమెరా, డిస్ ప్లే… ఈ ఉపకరణం శక్తివంతమైన, వైవిధ్యమైన ట్రిపుల్ కెమెరా వ్యవస్థను కలిగి ఉంది. ఇందులో 50 ఎంపి వైడ్ , 5 ఎంపి అల్ట్రా-వైడ్, 2 ఎంపి మాక్రో లెన్స్ ఉన్నాయి. నమ్మకం, విశ్వసనీయత.. విశ్వసనీయతను శాంసంగ్ గెలాక్సీ ఏ16 5జి పునర్నిర్వచిస్తోంది. ఆకట్టుకునే 6 తరాల ఓఎస్ అప్‌గ్రేడ్‌లు, 6 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్‌లను అందిస్తోంది. అద్భుతమైన గెలాక్సీ అనుభవాలు… గెలాక్సీ ఏ16 5జి శాంసంగ్ వాలెట్ ను పరిచయం చేసింది.
ఇది ఎన్ఎఫ్ సీ (నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్) ద్వారా విలక్షణమైన ట్యాప్ అండ్ పే సామర్థ్యాన్ని కలిగి ఉంది. అద్భుతమైన భద్రత అండ్ గోప్యత… గెలాక్సీ ఏ16 5జి అధునాతన నాక్స్ సెక్యూరిటీ ప్లాట్‌ఫారమ్‌తో భద్రత, గోప్యతకు ప్రాధాన్యత ఇస్తుంది. ఇందులో సురక్షిత పాస్‌వర్డ్ నిర్వహణ కోసం శాంసంగ్ పాస్, వ్యక్తిగత యాప్‌లను లాక్ చేయడానికి పిన్ యాప్. ధర, ప్రారంభ ఆఫర్‌లు… గెలాక్సీ ఏ16 5జి ఆవిష్కరణ ఆఫర్‌లో భాగంగా శాంసంగ్ ఇండియా దాని ట్యాప్ అండ్ పే ఫీచర్ కోసం ప్రత్యేక ప్రమోషన్ కార్యక్రమంను నిర్వహిస్తోంది. శాంసంగ్ వాలెట్ ద్వారా ఐదు ట్యాప్ అండ్ పే లావాదేవీలను పూర్తి చేసే వినియోగదారులు రూ. 500 వోచర్‌ను అందుకుంటారు. ఈ పరిమిత-కాల ఆఫర్ డిసెంబర్ 31, 2024 వరకు చెల్లుబాటులో ఉంటుంది.