హైదరాబాద్, (ప్రభ న్యూస్) : శాంసంగ్ తమ ప్రతిష్టాత్మక జాతీయ విద్య, ఆవిష్కరణల పోటీ అయిన సాల్వ్ ఫర్ టుమారో 2024 3వ ఎడిషన్‌లో గెలుపొందిన జట్లను ప్రకటించింది. పలు విభాగాల్లో ఎకో టెక్ ఇన్నోవేటర్, మెటల్ బృందాలను విజేతలుగా శాంసంగ్ ఇండియా ప్రకటించింది. శాంసంగ్ సౌత్‌వెస్ట్ ఆసియా ప్రెసిడెంట్, సీఈఓ జెబి పార్క్, భారతదేశంలోని ఐక్యరాజ్యసమితి రెసిడెంట్ కోఆర్డినేటర్ షోంబి షార్ప్ ఈ జట్లకు సర్టిఫికెట్లు, ట్రోఫీలను ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా శాంసంగ్ సౌత్‌వెస్ట్ ఆసియా ప్రెసిడెంట్ అండ్ సీఈఓ జెబి పార్క్ మాట్లాడుతూ… శాంసంగ్ వద్ద ఈ సంవత్సరం సాల్వ్ ఫర్ టుమారో ఎడిషన్‌లో పాల్గొన్న వారందరూ ప్రదర్శించిన ఆవిష్కరణ, సృజనాత్మకత గురించి తాము గర్విస్తున్నామన్నారు. ముఖ్యమైన సవాళ్లను పరిష్కరించడానికి అవసరమైన సాధనాలు, మార్గదర్శకత్వం, అవకాశాలను అందించడం ద్వారా యువతను శక్తివంతం చేయడం తాము లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.
ఐఐటి ఢిల్లీలోని ఎఫ్ఐటిటి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ నిఖిల్ అగర్వాల్ మాట్లాడుతూ… ఈ యువ ఆవిష్కర్తలను వారి అభివృద్ధి క్లిష్టమైన దశలో తీర్చిదిద్డేందుకు శాంసంగ్ తో భాగస్వామ్యం చేసుకోవటం గొప్ప గౌరవంగా భావిస్తున్నామన్నారు. తమ భాగస్వామ్యం ద్వారా తాము మెంటర్‌షిప్, శిక్షణ, అత్యాధునిక వనరులకు అవకాశాలను అందించామన్నారు. అవి విశ్వాసాన్ని కలిగించాయని, పోటీలో పాల్గొనే వారి ఆలోచనలను ఫలవంతం చేయడానికి శక్తినిచ్చాయన్నారు.
భారతదేశంలోని ఐక్యరాజ్య సమితి రెసిడెంట్ కోఆర్డినేటర్ షోంబి షార్ప్ మాట్లాడుతూ… సాల్వ్ ఫర్ టుమారో ప్రోగ్రామ్ మనకు అవసరమైన పరిష్కార-ఆధారిత ఆవిష్కరణ, సృజనాత్మక ఆలోచనలను అన్‌లాక్ చేయడానికి వారు పిలుపునిచ్చిన యువత అనుసంధానతకు ఉదాహరణగా నిలుస్తుందన్నారు.
టీమ్ ఎకో టెక్ ఇన్నోవేటర్, మెటల్ విజయాలు యువ మనస్సులకు సరైన నైపుణ్యాలు, వనరులు, కొత్త ఆవిష్కరణలకు ప్లాట్‌ఫారమ్‌లను కలిగి ఉన్నప్పుడు ఏమి సాధించవచ్చో చూపిస్తుందన్నారు. ఈ ఆవిష్కరణల సంస్కృతిని పెంపొందించినందుకు శాంసంగ్ కు తాము కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు.