భారత మార్కెట్లోకి శాంసంగ్ కొత్త సిరీస్ వచ్చేసింది. శాంసంగ్ గెలాక్సీ ఎస్24 సిరీస్‌ను మూడు వేరియంట్లలో గెలాక్సీ అన్ప్యాక్డ్ ఈవెంట్లో లాంచ్ చేసింది కంపెనీ. ఈ మూడు కొత్త గెలాక్సీ స్మార్ట్ఫోన్లు ఒకే స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ ద్వారా రన్ అవుతాయి. అయితే, కంపెనీ ఇప్పుడు భారత మార్కెట్లో ఈ శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్ఫోన్ల అధికారిక ధరను ధృవీకరించింది.
గెలాక్సీ ఎస్24 బేస్ వేరియంట్ రూ. 79,999 నుంచి ప్రారంభమవుతుంది. వెనిలా గెలాక్సీ ఎస్24 వేరియంట్ అంబర్ ఎల్లో, కోబాల్ట్ వైలెట్, ఓనిక్స్ బ్లాక్ కలర్ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. గెలాక్సీ ఎస్24 మోడల్ 8జీబీ ర్యామ్/256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 79,999 కాగా, 8జీబీ ర్యామ్/512జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 89,999 నుంచి అందుబాటులో ఉంటుంది.
ఇక, గెలాక్సీ ఎస్24+ వేరియంట్ కోబాల్ట్ వైలెట్, ఓనిక్స్ బ్లాక్ కలర్స్‌లో అందుబాటులో ఉంటుంది. గెలాక్సీ ఎస్24+ మోడల్ 12జీబీ ర్యామ్/512జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.99,999 ఉండగా, 12జీబీ ర్యామ్/512జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.1,09,999 నుంచి అందుబాటులో ఉంటుంది.
ప్రీమియం గెలాక్సీ ఎస్24 అల్ట్రా మోడల్ టైటానియం గ్రే, టైటానియం వైలెట్, టైటానియం బ్లాక్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 12జీబీ ర్యామ్/256 స్టోరేజ్ వేరియంట్ ధర 1,29,999 కాగా, 12జీబీ ర్యామ్/512జీబీ స్టోరేజ్ వెర్షన్ ధర రూ. 1,39,999, 12జీబీ/1టీబీ స్టోరేజ్ వెర్షన్ ధర రూ. 1,59,999 నుంచి అందుబాటులో ఉంటుంది.
గెలాక్సీ ఎస్24 అల్ట్రా స్పెసిఫికేషన్స్ :
శాంసంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రా మోడల్ 1-120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో అద్భుతమైన 6.8-అంగుళాల క్యూహెచ్డీ+ డైనమిక్ అమోల్డ్ 2ఎక్స్ డిస్ప్లేను కలిగి ఉంది. విశేషమైన 2,600-నిట్ పీక్ బ్రైట్‌నెస్‌తో అవుట్డోర్ విజిబిలిటీని పెంచే సరికొత్త విజన్ బూస్టర్ కలిగి ఉంది. ఈ డివైజ్ బరువు తక్కువ మాత్రమే కాదు.. ఫ్లాటర్ డిస్ప్లే, స్లిమ్మెర్ బెజెల్స్, టైటానియం ఫ్రేమ్‌తో ఫస్ట్ గెలాక్సీ ఫోన్‌గా చెప్పవచ్చు.