Saturday, October 26, 2024

Samsung | భార‌త్ లో మెడికేషన్స్ ట్రాకింగ్ కొత్త ఫీచర్‌ను ప్రకటించిన శాంసంగ్

హైదరాబాద్ : వినియోగదారులు తమ ఆరోగ్యాన్ని మరింత సమగ్రంగా నిర్వహించడంలో సహాయ పడటానికి వీలుగా శాంసంగ్ హెల్త్ యాప్2 నకు మెడికేషన్స్ ట్రాకింగ్ ఫీచర్1ని జోడించినట్లు భారతదేశ అతిపెద్ద వినియోగదారు ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ అయిన శాంసంగ్ ప్రకటించింది. ఈ ఫీచర్ వినియోగదారులకు వారికి సిఫారసు చేయబడిన లేదా ఓవర్ ది కౌంటర్ మందుల విధానాన్ని ట్రాక్ చేయడానికి వీలు కల్పించడమే కాకుండా ముఖ్యమైన వైద్య సమాచారం, చిట్కాలను కూడా అందిస్తుంది.

ఈసంద‌ర్భంగా నోయిడాలోని సామ్‌సంగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ మేనేజింగ్ డైరెక్టర్ క్యుంగ్యున్ రూ మాట్లాడుతూ…. శాంసంగ్ అనేది తన కొనుగోలుదారులకు మొదటి స్థానం ఇచ్చే బ్రాండ్ అన్నారు. ఇది వారి దైనందిన జీవితాన్ని మెరుగుపరచడానికి కావాల్సిన ఉత్పత్తులు, సేవలపై నిరంతరం పని చేస్తుందన్నారు. పరికరాలు, సేవలను కనెక్ట్ చేయడం ద్వారా ప్రజలు తమ ఆరోగ్యాన్ని బాగా అర్థం చేసుకోవడానికి, నిర్వహించడానికి సంపూర్ణ ఆరోగ్య వేదికను రూపొందించాలని తాము లక్ష్యంగా పెట్టుకున్నామ‌న్నారు.

శాంసంగ్ హెల్త్ యాప్‌లో భారతదేశానికి సంబంధించి మెడికేషన్స్ ఫీచర్‌ను జోడించడంతో, వినియోగదారులు తమ మందులను మరింత సౌకర్యవంతంగా నిర్వహించగలరని, కట్టుబడి ఉండడాన్ని మెరుగు పరచగలరని, అంతి మంగా మెరుగైన ఆరోగ్యాన్ని కాపాడుకోగలరని తాము విశ్వసిస్తున్నామ‌న్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement