ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ శాంసంగ్ నుంచి త్వరలో సరికొత్త ఫోన్ రాబోతోంది. శాంసంగ్ గెలాక్సీ S24 సిరీస్ వచ్చే ఏడాది జనవరిలో లాంచ్ కానుంది. పూర్తివివరాలు ఇలా ఉన్నాయి. శాంసంగ్ గెలాక్సీ ఎస్24 సిరీస్ లాంచ్‌కు కొన్ని వారాల సమయమే ఉండగా.. ఈ ప్లాగ్‌షిప్ ఫోన్‌ల ధరలు లాంచ్ కు ముందే లీక్ అయ్యాయి. దీంతో పాటు శాంసంగ్ గెలాక్సీ S24 సిరీస్ జనవరి 17 లాంచ్ కానున్నట్టు తెలుస్తొంది. దీనిపై శాంసంగ్ కంపెనీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. లీక్ అయిన సమాచారం ప్రకారం శాంసంగ్ ఎస్ 24 సిరీస్ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
భారత మార్కెట్‌లో శాంసంగ్ గెలాక్సీ ఎస్23 సిరీస్ ధర రూ.74,999 నుంచి ప్రారంభమయ్యే చాన్స్ ఉంది. యూరప్‌లో శాంసంగ్ గెలాక్సీ ఎస్24 బేస్ 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ మోడల్‌కు ఈయూఆర్ 899 (సుమారు రూ. 82వేల) ప్రారంభ ధరతో వస్తుంది. 256జీబీ స్టోరేజ్ మోడల్ ధర ఈయూఆర్ 959 (సుమారు రూ. 88వేలు) ఉండవచ్చు. గెలాక్సీ ఎస్24+ ధర 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ మోడల్ ధర ఈయూఆర్ 1,149 (సుమారు రూ. 1,05,000) మధ్య ఉండవచ్చు.
ఏ వేరియంట్ ధర ఎంత ఉండొచ్చుంటే? :
శాంసంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రా బ్రాండ్ నుంచి అత్యంత ప్రీమియం ఆఫర్‌గా అందించనుంది. 12జీబీ ర్యామ్ + 256జీబీ వెర్షన్ ధర ఈయూఆర్ 1,449 (సుమారు రూ. 1,33,500) ధర ఉంటుంది. శాంసంగ్ అల్ట్రా మోడల్‌ను 12జీబీ ర్యామ్+ 512జీబీ 12జీబీ + 1టీబీ వేరియంట్‌లతో రానుంది. ఈ శాంసంగ్ ధర వరుసగా ఈయూఆర్ 1,569 (దాదాపు రూ. 1,44,500), ఈయూఆర్ 1,809 (సుమారు రూ. 1,66,500) మధ్య ఉండవచ్చు.
శాంసంగ్ జనవరి 17న లాంచ్ అవుతుందని పుకార్లు ఎక్కువగా వినిపిస్తున్నందున 2024 ఈవెంట్‌కు సంబంధించిన తేదీలను కంపెనీ త్వరలో ప్రకటించవచ్చు. గత ఏడాదిలో ఈవెంట్‌కు కొన్ని వారాల ముందు బ్రాండ్ ఫీచర్ల వివరాలను వెల్లడించింది. లీక్ అయిన తేదీ కచ్చితమైనది అయితే, వినియోగదారులు రాబోయే రోజుల్లో గెలాక్సీ ఎస్24 సిరీస్ పొందవచ్చు.