శంషాబాద్ విమానాశ్రయంలో వ్యవ సాయ ఉత్పత్తుల ఎగుమతికి సంబంధించి 400 ఎకరాల్లో అగ్రి ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు సీఎం కేసీఆర్ ఆదేశిలి చ్చారని జీఎంఆర్ విమానాశ్రయ అధికారులు తెలిపారు. ఈ మేరకు శనివారం జయశంకర్ వ్యవసాయ యూనివర్శిటిలో మంత్రులు నిరంజన్ రెడ్డి,శ్రీనివాస్‌గౌడ్‌తో సమావేశమైన విమానాశ్రయ అధి కారులు పలు అంశాలపై చర్చించారు. ఇందు లో ప్రధానంగా పెరిషబుల్ కార్గో విస్తరణకు ప్రతి పాదనలు చేశారు. ప్రస్తుతం 5వేల చదరపు అడుగుల్లో ఉన్న కార్గోని 25 వేల చదరపు అడుగులకు విస్తరిం చాల్సి ఉందని తెలపగా, ఈ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకె ళ్తానని మంత్రి హామీ ఇచ్చారు. దీంతో పాటు మామిడి ఎగుమతికి ఇరేడిషియన్ సదుపా యా నికి ఏర్పాట్లు చేయ నున్నట్టు తెలిపారు. కాగా కార్గో విస్తరణ వలన కూరగా యలు, పండ్ల ఎగుమ తులకు మరింత అవకాశం ఉంటుందని, ప్రపంచ మార్కెట్లో డిమాండ్‌కు అనుగుణంగా ఎగుమ తులకు ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు. త్వరలోనే వ్యవసాయ, ఉద్యాన, మార్కెటింగ్ అధికా రులు, జిఎమ్మార్ ప్రతిని ధులతో సమా వేశం నిర్వహించనున్నట్టు తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement