ఓపెన్‌ఏఐ నుంచి ఉద్వాసనకకు గురైన శామ్ ఆల్ట్‌మన్ మైక్రోసాఫ్ట్‌లో చేరుతున్నారు.ఈ విషయాన్ని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదేళ్ల సోమవారం నాడు ప్రకటించారు. ఆల్ట్‌మన్ తమ కంపెనీలో కృత్రిమ మేథ పరిశోధన బృందంలో చేరనున్నారని తెలిపారు. ఈయనతో పాటు ఓపెన్‌ఏఐ నుంచి బయటకు వచ్చిన గ్రెగ్ బ్రాక్‌మన్ కూడా మైక్రోసాఫ్ట్‌లో చేరుతున్నారని సత్య నాదేళ్ల చెప్పారు.
టీమ్ నాయకులు వీరే…
ఆల్ట్‌మన్ బ్రాక్‌మన్ కలిసి మైక్రోసాఫ్ట్ ఏఐ టీమ్‌కు నేతృత్వం వహించనున్నట్లు నాదేళ్ల వెల్లడించారు. వారి విజయానికి కావాల్సిన వనరులు సమకూర్చేందుకు తామే వేగంగా చర్యలు చేపడతామని ఎక్స్ వేదికగా వెల్లడించారు. దీన్ని ఆల్ట్‌మెన్ కూడా ధృవీకరించారు. తమ లక్ష్యం కొనసాగుతుందని ఎక్స్‌లో ఆయన పోస్ట్ చేశారు.
మరో వీడియో స్ట్రీమింగ్ సైట్ ట్విచ్ సహ వ్యవస్థాపకుడు ఎమ్మెట్ షియర్‌ను కొత్త తాత్కాలిక సీఈఓగా ఓపెన్ ఏఐ బోర్డు నియమించింది. ఆల్ట్‌మన్‌ను తొలగించిన వెంటనే తాత్కాలిక సీఈఓ బాధ్యతలను మిరా మురాటికి అప్పగించారు. ఆమె కూడా ఆల్ట్‌మెన్‌కు మద్ధతు ప్రకటించారు. దీంతో బోర్డు వెంటనే మరో కొత్త సీఈఓగా ఎమ్మెట్ షియర్‌ను తీసుకు వచ్చింది. షియర్ ట్విచ్‌కు సీఈఓగా వ్యవహరించారు. 2014ల ట్విచ్‌ను అమెజాన్ కొనుగోలు చేసింది.
భాగస్వామ్యం కొనసాగుతుంది…
షియర్ నియామకాన్ని నాదేళ్ల కూడా ధృవీకరించారు. ఓపెన్‌ఏఐతో మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యం కొనసాగుతుందని సత్య నాదేళ్ల ప్రకటించారు. సంస్థతో కలిసి తాము రూపొందించిన ప్రొడక్ట్ రోడ్‌మ్యాప్ ముందుకు సాగుతుందన్నారు. ఓపెన్‌ఏఐ కొత్త నాయకత్వంతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు. ఓపెన్‌ఏఐలో మైక్రోసాఫ్ట్ అతి పెద్ద వాటాదారుగా ఉంది.
ఓపెన్‌ఏఐ సీఈఓగా తిరిగి శామ్ ఆల్ట్‌మన్‌ను తీసుకు వచ్చేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. తిరిగి వచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నాని చెప్పిన ఆల్ట్‌మన్ కొన్ని షరతులు పెట్టారు. దీనికి బోర్డు సభ్యులు అంగీకరించలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. శామ్‌ఆల్ట్‌మన్‌ను ఏపెన్‌ఏఐ సీఈఓ బాధ్యతలను తొలగించిన బోర్డు ఆయన సామర్ధ్యంపై నమ్మకం లేదని ప్రకటించింది. తాజాగా ఆయన మైక్రోసాఫ్ట్‌లో చేరడంతో ఒక ఏపెన్‌ఏఐకి వచ్చే అవకాశం లేదని సంబంధిత వర్గాలు తెలిపాయి.