చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు దేశంలో భారీగా పెరిగాయి. 2020లో అమ్మకాల్లో టాప్‌కు చేరిన ఈ ఫోన్లు తరువాత కాలంలో తగ్గాయి. తాజాగా మళ్లి అదే స్థాయిలో అమ్మకాలు పుంజుకున్నాయి. చైనా కంపెనీల అదాయాలు మాత్రం తగ్గాయి. ఇందుకు ప్రధానంగా ప్రీమియం సిగ్మెంట్‌లో కస్టమర్లు ఎక్కువగా ఐఫోన్, శాంసంగ్ హైఎండ్ ఫోన్లను కొనుగోలు చేస్తున్నారు.
మార్చి త్రైమాసికంలో చైనాకు చెందిన షావోమీ, వివో, ఒప్పో, రియల్ మీ, ట్రాన్సిషన్, మోటరోలా అన్నింటి మార్కెట్ వాటా 75 శాతం పెరిగింది. జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో అమ్మకాలు 61 శాతానికి పడిపోయాయి. ఈ వివరాలను కౌంటర్ పాయింట్ రిసెర్చ్ వెల్లడించింది. 2023లో కొన్ని త్రైమాసికాల్లో వివిధ కారణాలతో షావోమీ, వివో కంపెనీల స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు తగ్గాయి. తాజాగా 2024 నుంచి తిరిగి ఈ ఫోన్ల అమ్మకాలు భారీగా పుంజుకున్నాయి.
చైనాకు చెందిన చిన్న బ్రాండ్స్‌గా ఉన్న మోటరోలా, ట్రాన్సిషన్ వంటి కంపెనీలు కూడా అమ్మకాలు పెంచుకున్నాయి.
చైనా కంపెనీల అమ్మకాల పరంగా చూస్తే 2020లో 77 శాతం, 2023లో 61 శాతం, 2024లో 75 శాతం మార్కెట్ వాటా కలిగి ఉన్నాయి. రెవెన్యూ పరంగా 2020లో 70 శాతం, 2023లో 50 శాతం, 2024 ఈ త్రైమాసికంలో 48 శాతం రెవెన్యూ వాటా కలిగి ఉన్నాయి.
చైనా, భారత్ మధ్య ఏర్పడిన రాజకీయ, భౌగోళిక ఉద్రిక్తతలు చైనా మొబైల్ కంపెనీల అమ్మకాలపై కొద్దిగా ప్రభావం చూపించాయి. ఈ కంపెనీలకు చెందిన మొబైల్స్‌లో 7 వేల నుంచి 25 వేల లోపు ధర ఉన్న వాటి అమ్మకాలు భారీగా పెెరిగాయి. 25 వేల నుంచి 50 వేల ధరలో ఉన్న ఫోన్ల అమ్మకాలు ఈ త్రైమాసికంలో 18 శాతం పెరిగాయి. షావోమీ ఫోన్ల షిప్‌మెంట్ 28 శాతం పెరిగాయి. మోటరోలా అమ్మకాలు 58 శాతం పెరిగాయి. యాపిల్, శాంసంగ్ స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు ఎక్కువగా ప్రీమియం సిగ్మెంట్‌లో నమోదయ్యాయి.