స్టాక్ మార్కెట్‌లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు ఏప్రిల్ నుంచి జూన్ వరకు లక్ష కోట్ల మేర అమ్మకాలు జరిపారు. ఒక్క జూన్ నెలలోనే 50,203 కోట్ల మేర స్టాక్ మార్కెట్ నుంచి తమ పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. 2021-22 ఆర్ధిక సంవత్సరం మొత్తం అమ్మకాల్లో ఈ మూడు నెలల్లోనే 75 శాతం అమ్మకాలు జరిపారు. మూడు నెలల్లో మన దేశ ఈక్విటీ మార్కెట్ల నుంచి 1.07 లక్షల కోట్లను ఉపసంహరించుకున్నారని మార్కెట్ డేటా వెల్లడించింది. 2021 అక్టోబర్ నుంచి విదేశీ ఇన్వెస్టర్లు భారీ ఎత్తున అమ్మకాలకు పాల్పడుతున్నారు.
అమెరికా ఫెడరల్ బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచడం, ఆర్థిక మాంధ్యం వస్తుందన్న భయాలు, ద్రవ్యోల్బణం అంతకంతకూ పెరుగుతుండటం వంటి కారణాలతో విదేశీ ఇన్వెస్టర్లు మన మార్కెట్ల నుంచి పెట్టుబడులను భారీగా ఉపసంహరించుకుంటున్నారు. దీని ప్రభావం మన రూపాయిపై పడుతోంది. ఫలితంగా డాలర్‌తో రూపాయి మారకపు విలువ దారుణ స్థాయికి పడిపోయింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.