ఈ సంవత్సరం జనవరి- సెప్టెంబర్ మధ్య దేశవ్యాప్తంగా ప్రధానమైన 7 నగరాల్లో అపార్ట్‌మెంట్ల అమ్మకాల్లో 21 శాతం వృద్ధి ఉ న్నట్లు రియాల్టి కన్సల్టెంట్ సంస్థ జేఎల్‌ఎల్ తెలిపింది. ఈ 9 నెలల్లో మొత్తం 1,96,227 యూనిట్ల అమ్మకాలు జరిగాయని తెలిపింది. గత సంవత్సరం ఇదే కాలంలో 1,61,575 యూనిట్ల విక్రయాలు జరిగినట్ల తన నివేదికలో పేర్కొంది. 2022 మొత్తం సంవత్సరంలో అమ్మిన యూనిట్ల సంఖ్యతో పోలిస్తే, ఈ సంవత్సరం ఇప్పటికే 92 శాతానికి పైగా అమ్మకాలు జరిగాయని తెలిపింది.
పండగల సీజన్ కావడంతో అమ్మకాలు మరింతగా పెరుగుతాయని అంచనా వేసింది. ఈ సంవత్సరం చివరి నాటికి 2,15,000 యూనిట్ల అమ్మకాలు జరిగే సూచనలు ఉన్నయాని జేఎల్‌ఎల్ తన నివేదికలో వెల్లడించింది. ఢిల్లి, ముంబై, కోల్‌కతా, చెన్నయ్, బెంగళూర్, హైదరాబాద్, పుణే నగరాల్లో అపార్ట్‌మెంట్ల నిర్మాణంలో 21 శాతం వృద్ధి ఉన్నట్లు తెలిపింది.
2022 తొలి9 నెలల్లో 1,84,317 యూనిట్ల నిర్మాణం కాగా, ఈ సంవత్సరం సెప్టెంబర్ నాటికి 2,23,905 యూనిట్ల నిర్మాణం పూర్తయినట్లు తెలిపింది. ఇళ్లు, విల్లాలు, ప్లాట్లను ఈ నివేదికలో పరిగణలోకి తీసుకోలేదు. ఈ ఏడు ప్రధాన నగరాల్లో ప్రముఖ డెలవపర్లు నిర్మించిన ప్రాజెక్ట్‌లకు అధిక డిమాండ్ ఉందని పేర్కొంది. వడ్డీ రేట్లు మరింతగా పెరగకపోవడం, స్థిరాస్తి విక్రయాలకు అనుకూలంగా మారిందని జేఎల్‌ఎల్ అభిప్రాయపడింది. ఈ నగరాల్లో ఎక్కువగా లగ్జరీ అపార్ట్‌మెంట్ల అమ్మకాలు ఎక్కువగా ఉన్నాయి.