ప్రభుత్వ రంగ బ్యాంక్ ఐడీబీఐలో 60.72 శాతం వాటాను విక్రయించాలని నిర్ణయించిన ప్రభుత్వం దీని విలువను 7.7 బిలియన్ డాలర్లు”( 64 వేల కోట్లు )నిర్ణయించింది. ప్రభుత్వం ఇప్పటికే బ్యాంక్ అమ్మకానికి బిడ్లను అహ్వానించింది. దీని కోసం బిడ్డింగ్ ప్రక్రియలోనూ కొన్ని నిబంధనలను సడలించాలని సెబీకి ప్రభుత్వం కోరింది. ప్రస్తుత మార్కెట్ ప్రకారం ఐడీబీఐ నికర విలువ 5.8 బిలియన్ డాలర్లుగా ఉంది. దీనిపై 33 శాతం ప్రీమియంతో ధరను నిర్ణయించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ వార్తతో బ్యాంక్ షేరు ధర శుక్రవారం నాడు 3 శాతం పెరిగింది.
ప్రభుత్వం ,ఎల్‌ఐసీ విజయవంగా తమ వాటాను విక్రయిస్తే, ఇప్పటి వరకు ప్రభుత్వ రంగంలో అతి పెద్ద వాటా విక్రయింగా ఇది నిలవనుంది. ఈ ఆర్ధిక సంవత్సరంలో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా 62 వేల కోట్లు సమీకరిస్తామని బడ్జెట్‌లో ఆర్ధిక మంత్రి నిర్మలాసీతారామన్ ప్రకటిం చారు. ఇప్పుడు ఐడీబీఐ బ్యాంక్‌లో ఉన్న వాటా విక్రయిస్తే ప్రభుత్వానికి 64 వేల కోట్లు సమకూరనున్నాయి.
ఈ త్రైమాసికంలో ఐడీబీఐ ఆర్థిక ఫలితాలు మెరుగ్గా ఉన్నాయి. ఐడీబీఐని కొనుగోలు చేసేందుకు దేశ, విదేశీ బ్యాంక్‌లతో పాటు, ఆర్ధిక సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నాటికి బ్యాంక్ అమ్మకం ప్రక్రియ పూర్తి కానుంది. ఐడీబీఐలో ఎల్‌ఐసీ, ప్రభుత్వానికి కలిపి 95 శాతం వాటా ఉంది. 2019లోనే ఎల్‌ఐసీ ఈ బ్యాంక్‌లో 51 శాతం వాటాను కొనుగోలు చేసింది. శుక్రవారం నాడు ప్రకటించిన రెండో త్రైమాసిక ఆర్ధిక ఫలితాల్లో ఐడీబీఐ బ్యాంక్ నికర లాభం 46 శాతం పెరిగి ంది. బ్యాంక్ ఈ త్రైమాసికంలో 828 కోట్ల నికర లాభం ఆర్జించింది. బ్యాంక్ ఆదాయం 6,065.51 కోట్లుగా ఉంది. ఈ కాలంలో బ్యాంక్ తన ఎన్‌పీఏలను కూడా గణనీయంగా తగ్గించుకుంది.