Saturday, November 23, 2024

Cognizant | కాగ్నిజెంట్‌ ఉద్యోగులకు వేతనాలు పెంపు..

గత పదేళ్లుగా ఫ్రెషర్స్‌కి అతి తక్కువ సాలరీ ప్యాకేజీలు అందిస్తూ విమర్శలు ఎదుర్కొంటున్న కాగ్నిజెంట్‌ టెక్నాలజీ సొల్యూషన్స్‌ వేతనాల పెంపును ప్రకటించింది. కొంతమంది ఉద్యోగులకు వార్షిక జీతాల పెంపును కనిష్టంగా 1శాతం పెంచింది. జాతీయ మీడియా కథనాల ప్రకారం, గ్లోబల్‌ టెక్నాలజీ సర్వీసెస్‌ కంపెనీ నాలుగు నెలల ఆలస్యంగా జీతాల పెంపును ప్రారంభించింది.

జీతాల పెంపు కనిష్టంగా 1శాతం, గరిష్టంగా 5శాతం వరకు ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. 3 రేటింగ్‌ ఉద్యోగులకు 1-3శాతం, 4 రేటింగ్‌కు 4శాతం, 5 రేటింగ్‌ ఉద్యోగికి 4.5శాతం పెంపు ప్రకటించింది. గతేడాది నాస్‌డాక్‌లిస్టెడ్‌ కంపెనీ తన ఉద్యోగులకు ఏప్రిల్‌లో జీతాల పెంపుదలని 7 శాతం నుండి 11 శాతం వరకు పెంచింది. న్యూజెర్సీ కేంద్రంగా పనిచేసే ఈ సంస్థ భారతదేశంలో సుమారుగా 2,54,000 మంది ఉద్యోగులను కలిగి ఉంది. ఇది దాని మొత్తం శ్రామికశక్తిలో 70 శాతం వాటాను కలిగి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement