Friday, November 22, 2024

భారత్‌కు అతి పెద్ద చమురు సరఫరాదారుగా రష్యా

భారత్‌కు అత్యధిక చమురు సరఫరా చేసిన దేశంగా రష్యా నిలిచింది. ఈ జాబితాలో ముందుండే సౌదీ అరేబియా, ఇరాక్‌ను రష్యా అక్టోబర్‌ నెలలో వెనక్కి నెట్టింది. 2022 మార్చి 31తో ముగిసిన ఆర్ధిక సంవత్సరంలో భారత చమురు దిగుమతుల్లో రష్యా వాటా 0.2 శాతం. అదే అక్టోబర్‌లో మన దేశం రష్యా నుంచి రోజుకు 9,35,556 పీపాల చమురును దిగుమతి చేసుకుంది. అక్టోబర్‌లో మన చమురు దిగుమతుల్లో రష్యా వాటా 22 శాతంగా ఉంది. అదే సమయంలో ఇరాక్‌ నుంచి 20.5 శాం, సౌదీ అరేబియా నుంచి 16 శాతం చమురు దిగుమతి అయ్యింది.

ఉక్రెయిన్‌-రష్యా మధ్య యుద్ధం ప్రారంభమైన తరువాత రష్యా నుంచి మన దేశం చమురు దిగుమతులను గణనీయంగా పెరిగాయి. పశ్చిమ దేశాలు ఆ దేశ చమురు ఎగుమతులపై ఆంక్షలు విధించడంతోత రాయితీ ధరకు చమురు విక్రయించేందుకు రష్యా నిర్ణయించింది. దీన్ని అవకాశంగా తీసుకున్న భారత్‌ పెద్ద ఎత్తున రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకోవడం ప్రారంభించింది. 2021 డిసెంబర్‌లో రష్యా నుంచి మన దేశానికి రోజుకు 36,255 పీపాల చమురు మాత్రమే వచ్చింది. ఇదే ఇరాక్‌ నుంచి 1.05 మిలియన్లు, సౌదీ అరేబియా నుంచి 9,52,625 బ్యారెళ్ల చమురు దిగుమతి అయ్యింది.

ఈ సంవత్సరం మార్చిలో రష్యా నుంచి భారత్‌కు రోజుకు 68,600 పీపాల చమురు దిగుమతి అయ్యింఇ. మే నెలలో ఇది 2,66,617 పీపాలకు చేరింది. జూన్‌ నాటికి గరిష్టంగా 9,42,694 పీపాలకు చేరింది. అయినప్పటికీ ఆ నెలలో రోజుకు 1.04 మిలియన్‌ పీపాలతో ఇరాక్‌ అతి పెద్ద సరఫరాదారుగా ఉంది. రష్యా రెండో స్థానంలో ఉంది. రష్యా నుంచి మన దేశం భారీగా చమురు దిగుమతి చేసుకోవడాన్ని అమెరికాతో పాటు దాని మిత్రదేశాలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ, వ్యతిరేకిస్తున్నాయి. దీనికి

భారత్‌ ధీటుగానే జవాబు ఇచ్చింది. దేశ ప్రజల ప్రయోజనాలే తమకు ముఖ్యమని స్పష్టం చేసింది. ఇందు కోసం అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటామని స్పష్టం చేసింది. రష్యా నుంచి చమురు తక్కువ ధరకే దిగుమతి చేసుకోవడం వల్ల ఆర్ధిక వ్యవస్థకు ఎంతో మేలు జరుగుతున్నది. చమురు దిగుమతుల బిల్లు గణనీయంగా తగ్గింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement