Wednesday, November 20, 2024

రూపాయి భారీ పతనం..

అమెరికా వడ్డీ రేట్లు 75 బేసిస్‌ పాయింట్లు పెంచడంతో దీని ప్రభావం స్టాక్‌మార్కెట్లపై భారీగా పడింది. వడ్డీరేటు పెంచడంతో డాలర్‌ మరింత బలపడింది. ఫలితంగా మన కరెన్సీ రూపాయి విలువ ఎన్నడూ లేనంత కనిష్ట స్థాయికి పడిపోయింది. అమెరికా ఫెడరల్‌ బ్యాంక్‌ వడ్డీరేట్లును పెంచనుందని సంకేతాలు వెలువడిన నాటి నుంచే రూపాయి పతనం ప్రారంభమైంది. అంతర్జాతీయంగా అనేక దేశాల కరెన్సీలు డాలర్‌తో చూస్తే భారీగా పతనం అవుతున్నాయి. ఫోరెక్స్‌ మార్కెట్‌లో శుక్రవారం నాడు ఒక దశలో డాలర్‌తో రూపాయి మారకం విలువ 81.25 రూపాయిలకు పడిపోయింది. చివరకు ట్రేడింగ్‌ ముగిసే సమయానికి డాలర్‌తో రూపాయి మారకపు విలువ 80.98 రూపాయిలుగా ఉంది. రానున్న రోజుల్లో మరింత పతనమై 82 రూపాయలకు చేరుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.

జోక్యం చేసుకోని ఆర్బీఐ..

పాయి ఇంత భారీగా పతనం అవుతుంటే ఆర్బీఐ జోక్యం చేసుకుంటుందని ఇన్వెస్టర్లు ఆశించారు. రూపాయి మరింత పతనం కాకుండా ఆర్బీఐ తక్షణమే రంగంలోకి దిగాలని కోరుకుంటున్నారు. ఇప్పటికైనా ఆర్బీఐ రూపాయి మరింత పతనం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని ఆర్థిక రంగ నిపుణులు సైతం సూచిస్తున్నారు. 2022లో ఇప్పటి వరకు రూపాయల 8.5 శాతం నష్టపోయింది. అదే సమయంలో అమెరికా డాలర్‌ 16 శాతం బలపడి 111.41కి చేరింది. మార్కెట్ల పతనం, రూపాయల క్షిణించడంతో ప్రభుత్వ బాండ్లు కూడా నష్టాలను ఎదుర్కొంటున్నాయి. రూపాయి భారీగా పతనం కావడం గురువారం నుంచి ప్రారంభమైంది. ఇప్పటి వరకు మన రూపాయి ఇతర దేశాల కరెన్సీతో బలంగానే ఉందని చెబుతు వచ్చారు. విదేశీ పెట్టుబడులు తిరిగి రావడం ప్రారంభం కావడం, ఆర్బీఐ తీసుకున్న కొన్ని చర్యలు , ముడి చ మురు ధరలు తగ్గడం రూపాయి బలపడేందుకు కొంత మేర దోహదం చేశాయి.

ప్రస్తుతం పరిస్థతి భిన్నంగా మారింది. అన్ని దేశాల కంటే మన కరెన్సీనే ఎక్కువ పతనం అవుతుండటం ఆందోళన కల్గిస్తోంది. రూపాయి పతనాన్ని అడ్డుకునేందుకు ఆర్బీఐ డాలర్లను విక్రయించి ద్రవ్యలభ్యతను నియంత్రిస్తుంది. ప్రస్తుత పరిస్థితిలో రూపాయి దానికదే సర్దుబాటు చేసుకోవాలన్న ఉద్దేశ్యంతోనే ఆర్బీఐ జోక్యం చేసుకోవడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఉక్రెయిన్‌ యుద్ధం తరువా మన విదేశీ మారక నిల్వలు 80 బిలియన్‌ డాలర్ల మేర తగ్గిపోయాయి. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఆర్బీఐ వేచిచూసే దోరణి అనుసరిస్తుందని భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement