న్యూఢిల్లి : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) వద్ద గత కొద్ది కాలంగా పసిడి నిలలు పెరిగాయి. కానీ ఫారెక్స్ నిలలు మాత్రం భారీగా తగ్గాయి. గత వారం అమెరికా డాలర్ మారకంతో పోలిస్తే.. భారత్ కరెన్సీ రూపాయి ఆల్ టైమ్ కనిష్టానికి పడిపోయింది. డాలర్ మార్క్‌తో 77కు బలహీనపడింది. మున్ముందు డాలర్ మారకంతో రూపాయి 80కి పడిపోయినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. 2028-29 ఆర్థిక సంవత్సరం నాటికి.. డాలర్ మారకంతో రూపాయి వ్యాల్యూ 94కు పడిపోయే అవకాశాలు ఉన్నాయని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అంచనా వేస్తున్నది. భారత్ కరెన్సీ రూపాయి ఈ సంవత్సరం స్థిరంగా క్షీణతను నమోదు చేస్తోంది. 2022 క్యాలెండర్ ఏడాది ప్రారంభం నుంచి అమెరికా డాలర్ మారకంతో నాలుగు శాతం తగ్గింది. మరోవైపు భారత్ ఫారెక్స్ నిలలు 600 బిలియన్ డాలర్ల దిగువకు పడిపోయాయి.
సెప్టెంబర్ 3, 2021 నుంచి ఫారెక్స్ నిలలు 45 బిలియన్ డాలర్ల మేర పడిపోయాయి. అంతకుముందు 642 బిలియన్ డాలర్లతో ఆల్‌టైమ్ గరిష్టం. కానీ ఇప్పుడు భారీగా తగ్గింది. మే 6తో ముగిసిన వారానికి భారత్ ఫారెక్స్ రిజర్వ్ 595 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. రూపాయికి మద్దతుగా ఆర్‌బీఐ తీసుకున్న చర్యల కారణంగా భారత్ ఫారెక్స్ రిజర్వ్ తగ్గుముఖం పట్టాయని చెబుతున్నారు. ఆర్‌బీఐ నిలల్లో డాలర్, యూరో వంటివి ఉంటాయి. డాలర్ మారకంతో యూరో వ్యాల్యూ తగ్గితే.. ఇది ఫారెక్స్ నిలలో తగ్గుదలకు కారణం అవుతుంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..