బ్రిటన్‌కు చెందిన లగ్జరీ కార్ల కంపెనీ రోల్స్ రాయిస్ మన దేశంలో తన మొదటి లగ్జరీ ఎలక్ట్రిక్ కారు స్పెక్ట్రాను జనవరి 19న లాంచ్ చేయనుంది. ఈ కారు ఎక్స్‌షోరూమ్ ధర 7.50 కోట్లుగా కంపెనీ ప్రకటించింది. ఈ కొత్త స్పెక్ట్రా ఎలక్ట్రిక్ కారును ఆర్కిటెక్చర్ ఆఫ్ లగ్జరీ ప్లాట్‌ఫామ్‌పై నిర్మించినట్లు తెలిపింది.
రోల్స్ రాయిస్ కార్లలో స్పెక్ట్రా ఎరోడైనమిక్ కారని కంపెనీ తెలిపింది. ఈ కారులో డ్యుయల్ మోటార్ సెటప్ ఉంటుంది. ఈ కారు మోటార్ 577 హెచ్‌పీ పవర్‌ను, 900 ఎన్‌ఎం పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. స్పెక్ట్రా కారు సింగిల్ ఛార్జ్‌తో 520 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ తెలిపింది. ఈ కారు 4.5 సెకండ్లలో 0-100 కి.మీ. స్పీడ్ అందుకుంటుంది. 21 ఇంచ్‌ల అల్లాయ్ వీల్స్ కలిగి ఉంటుంది. 102 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్‌ను ఇందులో అమర్చారు.